Rekha Naik: కాంగ్రెస్ లో చేరనున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే

Rekha Naik: కాంగ్రెస్ లో చేరనున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే

సీఎం కేసీఆర్ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో పేర్లు లేని వాళ్లు తిరుగుబాటు బావుటా ఎగరవేయడానికి రెడీగా ఉన్నారు. తాజాగా నిర్మల్ జిల్లా ఖానాపూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే అజ్మీరా రేఖ నాయక్ కాంగ్రెస్ లో చేరనున్నారు. ఇప్పటికే ఆవిడ భర్త టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమక్ష్యంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. సోమవారం సీఎం కేసీఆర్ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో ఆవిడ సిట్టింగ్ స్థానాన్ని మరొకరికి కెటాయించడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. కాంగ్రెస్ నుంచి పోటీచేయడానికి ఇప్పటికే రేఖ నాయక్ దరఖాస్తు చేసుకున్నారు. ఆవిడ పీఏ గాంధీభవన్ కు వెళ్లి దరఖాస్తు ఇచ్చారు. ఈ రోజు రేవంత్ సమక్ష్యంలో ఆవిడ కాంగ్రెస్ లో చేరనున్నట్లు సమాచారం.


అయితే... ఖానాపూర్ అభ్యర్థిగా జాన్సన్ నాయక్ ను బీఆర్ఎస్ బరిలోకి దింపింది. మంత్రి కేటీఆర్ హైదరాబాద్ నిజాం కాలేజీలో చదువుతున్నప్పుడు జాన్సన్ క్లాస్ మేట్. సీఎం కేసీఆర్ మాత్రం గెలుపుగుర్రాలకే టికెట్లు ఇచ్చినట్లు తెలిపారు. 119 స్థానాలకు గాను 115 స్థానాలను ఆయన ప్రకటించారు. ఇందులో ఏడు స్థానాలకు మాత్రమే మార్పులు చేసినట్లు చెప్పారు.

రేఖ నాయక్ భర్త ఈ ఎన్నికలలో కాంగ్రెస్ నుంచి బరిలోదిగుతున్నట్లు తెలుస్తోంది. ఆయన ఆసిఫాబాద్ సెగ్మెంట్ నుంచి పోటీలో నిల్చోనున్నట్లు సమాచారం. రానున్న సాధారణ ఎన్నికల కోసం బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించిన తర్వాత రేఖ నాయక్ మొదటగా తిరుబాటు జెండాను ఎగరవేశారు. కాంగ్రెస్ లో చేరి తన సత్తాను చాటడానికి రెడీగా ఉన్నారు. ఈ రోజు రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు.

Tags

Read MoreRead Less
Next Story