కేటీఆర్‌కు బదులు ఈటల రాజేందర్‌ను సీఎంగా చేయాలి : జీవన్ రెడ్డి

కేటీఆర్‌కు బదులు ఈటల రాజేందర్‌ను సీఎంగా చేయాలి : జీవన్ రెడ్డి
సీఎం మార్పుపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌ జాతీయ రాజకీయాలవైపు వెళ్తే కేటీఆర్ కు సీఎంగా అవకాశం ఉండొచ్చన్నారు.

సీఎం మార్పుపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌ జాతీయ రాజకీయాలవైపు వెళ్తే కేటీఆర్ కు సీఎంగా అవకాశం ఉండొచ్చన్నారు. సీఎం అయ్యేందుకు కేటీఆర్ సమర్ధుడన్నారు. అయినప్పటికీ వారసత్వం అనే ముద్ర ఉంటుందన్నారు జీవన్ రెడ్డి.

అందుకే సీఎంగా కేటీఆర్ కు బదులు ఈటల రాజేందర్‌ను ముఖ్యమంత్రిగా చేస్తే పార్టీలో ఎవరూ వ్యతిరేకించరని జీవన్ రెడ్డి అన్నారు. మరోవైపు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని మంత్రి ఈటల రాజేందర్ మాట్లడడాన్ని ఆయన అభినందించారు.

పసుపు బోర్డు ఏర్పాటు కోసం రైతులు ఉద్యమిస్తున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శించారు. గిట్టుబాటు ధర కల్పించి పసుపు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని జీవన్‌ రెడ్డి... సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. గతంలో క్వింటాలు పసుపు అమ్మితే తులం బంగారం కొనేవారన్నారు.

కానీ ఇప్పుడా పరిస్థితులు లేవని జీవన్ రెడ్డి అన్నారు. ఇప్పటికైనా కేసీఆర్ పసుపునకు మద్దతు ధర కల్పించి 10 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని జీవన్ రెడ్డి లేఖలో డిమాండ్ చేశారు. గెలిచిన వంద రోజుల్లో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తానని ధర్మపురి అరవింద్ వాగ్దానం చేశారు. కానీ ఇంతవరకు ఆ ఊసే లేదన్నారు.

Tags

Read MoreRead Less
Next Story