MMTS services : రేపటి నుంచి పట్టాలెక్కనున్న ఎంఎంటీఎస్‌ రైళ్లు..!

MMTS services : రేపటి నుంచి పట్టాలెక్కనున్న ఎంఎంటీఎస్‌ రైళ్లు..!
MMTS services : భాగ్యనగరంలో ఎంఎంటీఎస్‌ రైళ్లు పట్టాలెక్కనున్నాయి. 15 నెలల సుదీర్ఘ విరామం తరువాత రైళ్లు పరుగులు తీయనున్నాయి.

MMTS services : భాగ్యనగరంలో ఎంఎంటీఎస్‌ రైళ్లు పట్టాలెక్కనున్నాయి. 15 నెలల సుదీర్ఘ విరామం తరువాత రైళ్లు పరుగులు తీయనున్నాయి. గతేడాది కరోనాతో నిలిచిపోయిన రైళ్ల సేవలు తిరిగి రేపటి నుంచి ప్రారంభంకానున్నాయి. మొత్తం 121 ఎంఎంటీఎస్‌ సర్వీస్‌లుకు గాను.. 10 సర్వీసులన ప్రారంభించి పరిస్థితులను బట్టి మిగతా సర్వీసులను ప్రారంభించనున్నారు. హైదరాబాద్‌ ట్రాఫిక్‌ రద్దీ నియంత్రణలో ఎంఎంటీఎస్‌ ప్రముఖ పాత్ర పోషిస్తుంది.

నిత్యం 121 సర్వీసులతో.. లక్ష 65 వేల మందిని గమ్య స్థానాలకు చేరుస్తుంది. రాష్ట్రంలో అతిచవకైన రవాణా సాధనం ఎంఎంటీఎస్‌ కావడం విశేషం. 2003 లో ప్రారంభమైన ఎంఎంటీఎస్‌ సర్వీసులు.. కొన్ని గంటలు తప్ప.. 15 నెలల సుదీర్ఘ కాలం ఆగిన దాఖలాలు లేవు. కరోనా తొలి దశ తర్వాత ఎక్స్‌ ప్రెస్‌ రైళ్ల సేవలతో పాటు.. లోకల్‌ రైళ్లను పునరుద్ధరించిన.. ఎంఎంటీఎస్‌ సర్వీసులను రైల్వే బోర్డు తిరిగి ప్రారంభించలేదు. కోవిడ్‌ సెంకడ్‌ వేవ్‌ తగ్గుముఖం పట్టడంతో ఎంఎంటీఎస్‌ను తిరిగి ప్రారంభించాలని అధికారులు నిర్ణయించారు.

Tags

Read MoreRead Less
Next Story