నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య హఠాన్మరణం

నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య హఠాన్మరణం

నాగార్జునసాగర్‌ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య హఠాన్మరణం చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న నోముల నర్సింహయ్య... హైదరాబాద్‌ అపోలో హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. నకిరేకల్‌ నుంచి రెండు సార్లు సీపీఎం ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. సుదీర్ఘకాలం సీపీఎంలో పని చేశారు. 2013లో టీఆర్‌ఎస్‌లో చేరిన నోముల నర్సింహయ్య... 2014లో నాగార్జునసాగర్‌లో కాంగ్రెస్‌నేత జానారెడ్డిపై పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2018లో నాగార్జునసాగర్‌ నుంచే జానారెడ్డిపై నోముల నర్సింహయ్య ఘన విజయం సాధించారు.

నకిరేకల్ మండలం పాలెం గ్రామానికి చెందిన ఆయన నకిరేకల్ ఎమ్మెల్యేగా రెండుసార్లు గెలుపొందారు. సీపీఎం రాష్ట్రకమిటి సభ్యునిగా చాలా కాలం కొనసాగారు. సీపీఎం శాసన సభపక్షనేతగా పనిచేశారు. 2014 సంవత్సరంలో ఆయనకు సొంత జిల్లా నల్గొండ నియోజకవర్గం నుంచి టికెట్ లభించకపోవడంతో మనస్తాపం చెందిన ఆయన సీపీఎంకు రాజీనామా చేసి... టీఆర్‌ ఎస్ పార్టీలో చేరారు. 2009లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో నల్గొండలోని భువనగిరి లోక్‌ సభ నియోజవర్గం నుంచి పార్లమెంట్ సభ్యుడిగా పోటీచేసి ఓటమి పాలయ్యారు.

2014లో నాగార్జున సాగర్ శాసన సభ నియోజకవర్గంనుంచి కాంగ్రెస్ అభ్యర్ధి జానారెడ్డిపై టీఆర్‌ నుంచి పోటీచేసి పరాజయం పాలయ్యారు. ప్రస్తుతం ఆయన నాగార్జున సాగర్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఆయన ఉమ్మడి నల్గొండ జిల్లా నకిరేకల్ మండలం పాలెం గ్రామంలో 1956 జనవరి 6వ తేదీన జన్మించారు. విద్యార్ధి దశనుంచే ఆయన ఉద్యమాలపై ఆకర్షితులై సీపిఎంపార్టీలో చురుకుగా పనిచేశారు. అంచలంచలుగా ఆయన రాష్ట్రస్థాయి నేతగా ఎదిగారు.

Tags

Read MoreRead Less
Next Story