మాజీ హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి ఆరోగ్య పరిస్థితి మరింత విషమం

మాజీ హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి ఆరోగ్య పరిస్థితి మరింత విషమం

తెలంగాణ మాజీ హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి ఆరోగ్య పరిస్థితి మరింత విషమించింది. హెల్త్‌ కండీషన్‌ క్రిటికల్‌గా ఉన్నట్టు తెలుస్తోంది. ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌, న్యుమోనియాతో బాధపడుతున్న ఆయన ప్రస్తుతం జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. అడ్వాన్స్‌డ్ క్రిటికల్ కేర్ యూనిట్‌లో వెంటిలేటర్‌పై ఉన్నారు.

గత నెల 28న కరోనా బారిన పడ్డ నాయిని బంజారాహిల్స్‌లోని సిటీ న్యూరో సెంటర్ ఆస్పత్రిలో చేరారు. 16 రోజుల చికిత్స అనంతరం కరోనా నుంచి బయటపడ్డారు. వారం రోజుల క్రితం కరోనా పరీక్షలు నిర్వహించగా నెగెటివ్‌ కూడా వచ్చింది. దీంతో ఇంటికి వెళ్లారు. తాజాగా మళ్లీ ఊపిరి తీసుకోవడం కష్టంగా మారడంతో టెస్టులు చేయిస్తే న్యుమోనియా సోకిందని డాక్టర్లు తేల్చారు. ఆక్సిజన్‌ లెవల్స్‌ పడిపోయవంతో...ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు మంగళవారం ఆయనను హుటాహుటిన అపోలో ఆసుపత్రికి తరలించారు. నాయినికి పల్మనాలజీ , కిడ్ని స్పెషలిస్టులు వైద్యసేవలు అందిస్తున్నారు.

నాయిని భార్య అహల్యకు కూడా కరోనా సోకింది. బంజారాహిల్స్‌లోని సిటీ న్యూరో సెంటర్‌లో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆమెకు పరీక్షలో నెగెటివ్‌ వచ్చినప్పటికీ ఆసుపత్రిలోనే ఉండి మెరుగైన చికిత్స తీసుకుంటున్నారు. అలాగే నాయిని అల్లుడు, ఆయన పెద్ద కుమారుడు కూడా కరోనా బారిన పడి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story