Ndsa Committee : సీడీవోపై ఎన్​డీఎస్​ఏ కమిటీ ప్రశ్నల వర్షం

Ndsa Committee : సీడీవోపై ఎన్​డీఎస్​ఏ కమిటీ ప్రశ్నల వర్షం
డిజైన్లలో సీడబ్ల్యూసీ మార్గదర్శకాలు పాటించటంపై అనుమానాలు

ఓ వైపు ఇంజినీర్లు మరోవైపు గుత్తేదార్ల ప్రతినిధులకు చంద్రశేఖర్ అయ్యర్ కమిటీ ప్రశ్నల వర్షం కురిపించింది. మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిళ్ల ఆనకట్టలకు సంబంధించిన డిజైన్స్, అందులోని సందేహాలను ప్రధానంగా ప్రస్తావిస్తూ విడివిడిగా సమావేశం అవుతోంది. ఆనకట్టల నిర్వహణ ప్రత్యేకించి 2019 పరిణామాల తర్వాత తీసుకున్న చర్యలు, చేసిన తనిఖీల పై కమిటీ ప్రత్యేకంగా సృష్టి సారించింది.

సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ ఇంజినీర్లతో భేటీ అయింది. మూడు ఆనకట్టలకు సంబంధించిన డిజైన్స్ గురించి వారిని పూర్తిగా అడిగి తెలుసుకున్నారు. అన్నారం, సుందిళ్ల డిజైన్స్‌ను తామే రూపొందించామని... మేడిగడ్డ డిజైన్‌ మాత్రం L&T సంస్థ రూపొందిస్తే I.S కోడ్ నిబంధనల ప్రకారం ఆమోదించామని CDO ఇంజినీర్లు కమిటీకి వివరించినట్లు సమాచారం. డిజైన్లు ఎవరు తయారు చేశారు? ఎవరు ఆమోదించారు? ఎవరి కారణంగా అయినా మార్పులు చేయాల్సి వచ్చిందా? మార్పులు చేస్తే ఎవరి అనుమతి తీసుకున్నారు? తదితర ప్రశ్నలను కమిటీ ఇంజినీర్లను అడిగింది. సీకెంట్ ఫైల్స్‌కు సంబంధించి కూడా పూర్తి వివరాలు తీసుకుది. మొత్తం తొమ్మిది అంశాలకు సంబంధించిన ప్రశ్నావళి ఇచ్చి వాటికి సంబంధించి పూర్తి వివరాలు ఇవ్వాలని చంద్రశేఖర్ అయ్యర్ కమిటీ స్పష్టం చేసింది. మూడు ఆనకట్టల నిర్మాణాన్ని పర్యవేక్షించిన ఇంజినీర్ల నుంచి కూడా కమిటీ వివరాలు తీసుకుంది. నిర్మాణానికి ముందు ఇన్వెస్టిగేషన్స్ నిర్దేశిత విధానంలో చేశారా లేదా అని అడిగింది. మేడిగడ్డ విషయంలో షీట్ ఫైల్స్, సీకెంట్ ఫైల్స్ మార్పులు ఎందుకు చేయాల్సి వచ్చిందని ప్రశ్నించింది. రాఫ్ట్ ఫౌండేషన్ గురించి కూడా ఆరా తీసింది. ముందు అనుకున్న సమయం కన్నా తక్కువ వ్యవధిలోనే మేడిగడ్డ ఆనకట్ట పూర్తి చేసిన తరుణంలో నాణ్యతకు సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారని, క్వాలిటీ కంట్రోల్ నివేదికలు ఎవరికి ఇచ్చారని కమిటీ అడిగింది. ఎక్కడైనా నాణ్యతా లోపాలు ఉంటే ఎవరి దృష్టికి తీసుకెళ్లారు? వాటిని ఎలా సరి చేశారు? దానిపై తీసుకున్న చర్యలు ఏమిటని అడిగింది. ఆనకట్టల నిర్వహణ బాధ్యతలు చూసిన ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఇంజినీర్లతో సమావేశమైన కమిటీ అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి చేపట్టిన నిర్వహణ చర్యల గురించి తెలుసుకోండి నిర్వహణలో భాగంగా చేసిన తనిఖీలు వాటి వివరాలను కూడా అడిగింది 2019 లో ఆనకట్టల వెనుక భాగంలో ఉన్న సిసి బ్లాక్ దెబ్బతినడం సహా ఇతరత్రా పరిణామాల అనంతరం తీసుకున్న చర్యలపై కమిటీ ప్రధానంగా దృష్టి సారించింది ఆ తరువాత నిర్వహణ చర్యలు ఏ మేరకు చేపట్టారు ఎన్నిసార్లు తనిఖీ చేశారు వాటికి సంబంధించిన సమగ్ర వివరాలు కావాలని అడిగింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టల నిర్మించిన గుత్తేదారుల ప్రతినిధులతోనూ కమిటీ సమావేశమైంది.

Tags

Read MoreRead Less
Next Story