Medigadda Barrage: మేడిగడ్డను సందర్శించిన నిపుణుల బృందం

Medigadda Barrage: మేడిగడ్డను సందర్శించిన నిపుణుల బృందం
సుమారు 4 గంటలకు పైగా పరిశీలించిన అధికారులు

మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగడం వెనుక కారణాలు, లోపాలు తేల్చేందుకు ఎన్.డి.ఎస్.ఏ నిపుణుల కమిటీ రంగంలోకి దిగింది. ఆరుగురు సభ్యుల బృందం మొదటిరోజు మేడిగడ్డ బ్యారేజ్ వద్ద పరిశీలించారు. వారితో పాటు పాల్గొన్న రాష్ట్ర నీటి పారుదల శాఖ అధికారుల నుండి సమాచారం సేకరించారు.

ఉదయం 8 గంటలకు మేడిగడ్డలోని ఎల్‌అండ్‌టీ సంస్థ క్యాంప్‌ కార్యాలయంలో ఇంజినీరింగ్‌ అధికారులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి బరాజ్‌కు సంబంధించిన అంశాలపై చర్చించారు. 9.30 గంటలకు మేడిగడ్డ బరాజ్‌ వద్దకు చేరుకొని కుంగిన ప్రాంతాన్ని పరిశీలించారు. బరాజ్‌ డిజైన్‌, నిర్మాణం, లోపాలపై అధ్యయనం చేశారు. అక్కడి నుంచి మహారాష్ట్ర వైపు ఉన్న బరాజ్‌ ఏడో బ్లాక్‌లో కుంగిన 19, 20, 21వ పియర్ల దిగువ భాగాన్ని పరిశీలించారు. కుంగిన పియర్ల వద్ద ఉన్న గేట్ల పరిస్థితిని పరిశీలించారు. బరాజ్‌లో సమస్యలు తలెత్తకుండా చేపట్టాల్సిన పునరుద్ధరణ పనులపై చర్చించారు. బృం దంలో చంద్రశేఖర్‌ అయ్యర్‌తోపాటు సెంట్రల్‌ వాటర్‌, పవర్‌ రిసెర్చ్‌ స్టేషన్‌ సైంటిస్ట్‌ ఆర్‌ పాటిల్‌, సెంట్రల్‌ సాయిల్‌ అండ్‌ మెటీరియల్‌ రిసెర్చ్‌ స్టేషన్‌ సైంటిస్ట్‌ యూసీ విద్యా ర్థి, సీడబ్ల్యూసీ బీసీడీ డైరెక్టర్‌ శివకుమార్‌, గేట్స్‌, సీడబ్ల్యూసీ, డిజాస్టర్‌ అండ్‌ రిసిలెయెన్స్‌ డైరెక్టర్‌ రాహుల్‌ కుమార్‌ ఉన్నారు.

NDSA కోరిన పూర్తి వివరాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం తరుపున భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ శాఖ అధికారులను ఆదేశించారు. కమిటీ కోరిన వివరాలు అందించిన ఇంజనీరింగ్ నీటి పారుదలశాఖ ఇంజనీరింగ్ అధికారుల బృందం NDSA నిపుణుల కమిటీతో కలిసి విచారణలో పాల్గొన్నారు. డ్యామ్ సేఫ్టీ, లోపాల పై పూర్తి స్థాయిలో అధ్యయనం చేస్తున్న కమిటీ.. బ్యారేజ్‎లో 16.17 tmc నీటి స్టోరేజ్ సామర్ధ్యం ఉందా.. అనే వివరాలపై ఆరా తీశారు. NDSA నిపుణుల కమిటీ విచారణ సందర్బంగా మేడిగడ్డ బ్యారేజ్ పరిసరాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. మొదటిరోజు మెడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగిపోవడం, డ్యామ్ సేఫ్టీ పై పూర్తిస్థాయి అధ్యయనం చేసిన తరువాత రాత్రి రామగుండం లోని NTPC గెస్ట్ హౌజ్ లో బస చేస్తారు. శుక్రవారం ఉదయం అన్నారం, సుందిళ్ళ బ్యారేజ్‎లను పరిశీలిస్తారు. క్షేత్ర స్థాయిలో పరిశీలించి ఒక అంచనాకు వచ్చిన అనంతరం ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తారు. నిపుణుల కమిటీ విచారణ సందర్బంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. బ్యారేజ్ వద్దకు ఎవరిని అనుమతించడం లేదు. ఈ కమిటీ చివరకు ఏం తెల్చుతుందో చూడాలి.

Tags

Read MoreRead Less
Next Story