వెరైటీ సైకిళ్లు తయారు చేస్తున్న పంచర్ వేసే షాప్ నడిపే వ్యక్తి

వెరైటీ సైకిళ్లు తయారు చేస్తున్న పంచర్ వేసే షాప్ నడిపే వ్యక్తి

కొత్తొక వింత పాతొక రోత అంటారు. కానీ పాత వస్తువులను ఉపయోగించి కొత్త రకం సైకిళ్లు తయారు చేయొచ్చని నిరూపిస్తున్నాడు అంజద్ పాషా. ఇతడు తయారు చేసిన రివర్స్ సైకిల్ అందరినీ ఆకట్టుకుంటోంది. సీటుపైన కూర్చుని సైకిల్ తొక్కడం కామనే. కానీ తల కిందికి కాళ్లు పైకి చేసి సైకిల్ తొక్కడం అంజద్ పాషా పత్ర్యేకత. అలాంటి సైకిలే ఒకటి తయారు చేసి అందరి చేత శభాష్ అనిపించుకుంటున్నాడు.

సిద్ధిపేట జిల్లా గజ్వేల్‌ పట్టణానికి చెందిన అంజద్ పాషా సైకిల్ రిపేర్లు, పంచర్ వేసే షాప్ నడుపుతున్నాడు. ఆరేళ్ల వయసులోనే తండ్రి మరణించడంతో చిన్నప్పటి నుంచే సైకిల్ పంక్చర్ వేయడం నేర్చుకున్నాడు. దాని ద్వారా వచ్చిన ఆదాయంతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. కానీ అదే పనికి పరిమితం కావడం ఇష్టంలేని అంజద్ పాషా కొత్త దనం కోసం తపించాడు. తన వృత్తిలో నైపుణ్యం సాధించి పాత వస్తువులతో కొత్త కొత్త రకం సైకిళ్లు తయారు చేయడం ప్రారంభించాడు. ఇలా ఇప్పటిదాకా వందకుపైగా మోడళ్లను తయారు చేసి ఇప్పటిదాకా 10 ప్రపంచ స్థాయి రికార్డులు సైతం నెలకొల్పాడు. 1995లో డబుల్ సైకిల్ తయారు చేసి పలువురి ప్రశంసలు అందుకున్నాడు. ఇక గిన్నిస్ రికార్డు సాధించడం, సీఎం కేసీఆర్‌ మెప్పు పొందడమే తన ధ్యేయమని అంజద్ పాషా అంటున్నాడు.

Tags

Read MoreRead Less
Next Story