Shamshabad: వాగులో వెంచర్... నీట మునిగిన వైనం

Shamshabad: వాగులో  వెంచర్... నీట మునిగిన వైనం
అంచమడుగు వాగులో 40 ఎకరాల్లో అక్రమ వెంచర్; మురళీ మోహన్ సమీప బంధువులకు చెందిన ప్రాణ వెంచర్‌

రంగారెడ్డి జిల్లాలో వాగులో వెంచర్లు జనాలను బెంబేలెత్తిస్తున్నాయి.శంషాబాద్ మండలం మల్కారంలో సర్వే నెంబర్‌ 75,76,77లో వెంచర్లు నీట మునిగిపోయాయి. అంచమడుగు వాగులో దాదాపు 40 ఎకరాల్లో మురళీ మోహన్ సమీప బంధువులు ప్రాణ పేరుతో ఓ అక్రమ వెంచర్‌ వేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. మురళీమోహన్‌ కోడలు మాగంటి రూప,రామారావు పెద్ది బాగస్వాములుగా ఉన్న గ్రీన్‌ తత్వ,అగ్రిటెక్‌,LLP ఈ మధ్యనే ప్రాణ వెంచర్‌ ఫ్రీ లాంచింగ్ చేశారు. గజం రేటు 18 వేల నుంచి 25 వేల రూపాయలగా నిర్ణయించారు. అయితే 111 జీఓ నేపధ్యంలో గజాల చొప్పున కాకుండా గుంటల చొప్పున రిజిస్ట్రేషన్‌ చేసి చేతులు దులుపుకున్నారు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు.

హైదరాబాద్‌ చుట్టుపక్కల వెంచర్లు అంటేనే ఒకప్పుడు భయపడేవారు.పేపర్ల పైనే ప్లాట్లు ఉంటాయి కానీ బౌగోళికంగా మాత్రం ఉండవనే పేరు ఉండేది..ఒ క వేళ ప్లాట్లు ఉన్నా కానీ దాన్ని ఇద్దరు ముగ్గురికి రిజిస్ట్రేషన్‌ చేసేవారు. అయితే తరువాతి కాలంలో బడా సంస్థలు రంగంలోకి దిగిన తరువాత రియల్‌ ఎస్టేట్‌ రంగం తన స్వరూపం మార్చుకుంది. ఫాం ల్యాండ్స్‌,విల్లాల పేరుతో ఎకరాల భూములను అమ్మడం మొదలు పెట్టారు. అయితే సిటీకి దూరంగా ఈ వెంచర్లు ఉండటంతో అవి చెరువులో ఉన్నాయో..లేక నిషేదిత ప్రాంతాల్లో ఉన్నాయో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ నేపధ్యంలో మాజీ ఎంపీ మురళీమోహన్‌ కోడలు మాగంటి రూప ప్రాణ పేరుతో గ్రీన్‌ తత్త్వ వెంచర్‌ను వేశారు. అది చెరువు పారివాహిక ప్రాంతంలో ఉండటంతో చిన్న వర్షాలకే చెరువులను తలపిస్తున్నాయి.

ఇక అక్రమ వెంచర్‌పై చర్యలు తీసుకోవాలని గతంలోనే మంత్రి సబితా ఇంద్రారెడ్డి కు ఫిర్యాదు చేశారు ,మల్కారం, సుల్తాన్‌పల్లి, కేబీ దొడ్డి వాసులు. ఇక అక్రమ వెంచర్‌పై చూడనట్లుగా అధికారులు వదిలేయడంతో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు ఆడింది ఆటగా పాడింది పాటగా మారిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇరిగేషన్‌ అధికారులు గుడ్డిగా NOC ఇవ్వడం,రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులకు స్థానిక నేతలు కొమ్ము కాయడంతో అక్రమ వెంచర్‌లోని ప్లాట్లను కుచ్చుటోపి పెట్టి మరీ విక్రయించారని విమర్శలు వస్తున్నాయి.ఇంత జరుగుతున్నా నేతల ఒత్తిళ్లకు తలొగ్గి రెవిన్యూ అధికారులు లైట్‌ తీసుకున్నారని ఆరోపిస్తున్నారు స్థానికులు

Tags

Read MoreRead Less
Next Story