తెలంగాణ అసెంబ్లీలో కొత్త రెవెన్యూ బిల్లు పాస్

తెలంగాణ అసెంబ్లీలో కొత్త రెవెన్యూ బిల్లు పాస్
తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన కొత్త రెవెన్యూ బిల్లు అసెంబ్లీలో పాస్ అయింది. ఈ చట్టానికి సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. అంతకుముందు వీఆర్‌ఓ..

తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన కొత్త రెవెన్యూ బిల్లు అసెంబ్లీలో పాస్ అయింది. ఈ చట్టానికి సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. అంతకుముందు వీఆర్‌ఓ రద్దుకు సంబంధించిన బిల్లును కూడా సభ ఆమోదించింది. రెవెన్యూ చట్టంలో సమూల మార్పులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ బిల్లుపై శాసనసభలో సుదీర్ఘంగా చర్చ జరిగింది. చర్చను మొదట సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఆ తర్వాత కాంగ్రెస్, టీఆర్‌ఎస్, ఎంఐఎం సభ్యులు చర్చ కొనసాగించారు. కాంగ్రెస్ పార్టీ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు చట్టంపై ప్రభుత్వానికి పలు సూచనలు చేశారు. ఇక వక్ఫ్‌ భూములు అన్యాక్రాంతం కావడంపై ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైస్ సభ దృష్టికి తెచ్చారు. అయితే వక్ఫ్, దేవాదాయ భూములు ఇక నుంచి రిజిస్ట్రేషన్ కాకుండా ధరణి పోర్టల్‌లో ఆటో లాక్‌ అవుతుందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

Tags

Read MoreRead Less
Next Story