Nitin Gadkari : కాళేశ్వరం ప్రాజెక్ట్‌ ఫలితాలు తెలంగాణలో కనిపిస్తున్నాయి : కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ

Nitin Gadkari :  కాళేశ్వరం ప్రాజెక్ట్‌ ఫలితాలు తెలంగాణలో కనిపిస్తున్నాయి :  కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ
Nitin Gadkari : తెలంగాణను అభివృద్ధి చెందితే భారతదేశం అభివృద్ధి సాధించినట్టేనంటూ కీలక వ్యాఖ్యలు చేశారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ.

Nitin Gadkari : తెలంగాణను అభివృద్ధి చెందితే భారతదేశం అభివృద్ధి సాధించినట్టేనంటూ కీలక వ్యాఖ్యలు చేశారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. అభివృద్ధికి కావాల్సినవి నీళ్లు, కరెంట్, రవాణా, సమాచార వ్యవస్థనే అన్నారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. ఇందులో భాగంగానే కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణ రాష్ట్రం నీటి సమస్యను పరిష్కరించుకుందని వ్యాఖ్యానించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఫలితాలు కనిపిస్తున్నాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా రోడ్లతో సమానంగా తెలంగాణ హైవేలను అభివృద్ధి చేస్తామన్నారు. రీజనల్‌ రింగ్‌ రోడ్‌ శంకుస్థాపనకు మూడు నెలల్లో హైదరాబాద్‌ వస్తానన్నారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ.

తెలంగాణలో రెండు జాతీయ రహదారులను జాతికి అంకితం ఇచ్చారు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ. రాంసాన్‌పల్లి నుంచి మంగళూరుకు 1614 కోట్ల వ్యయంతో నిర్మించిన 47వ నెంబర్‌ జాతీయ రహదారితో పాటు మంగళూరు నుంచి మహారాష్ట్ర సరిహద్దు వరకు 49 కిలోమీటర్ల మేర 1312 కోట్లతో నిర్మించిన జాతీయ రహదారిని జాతికి అంకితం చేశారు. మరో పది నేషనల్ హైవేస్‌ నిర్మాణానికి నితిన్ గడ్కరీ శంకుస్థాపన చేశారు. ఎల్బీనగర్ నుంచి మల్కాపూర్ వరకు, గుండ్లపోచంపల్లి నుంచి బోయినపల్లి వరకు, కల్కల్లు నుంచి గుండ్లపోచంపల్లి వరకు, దుద్దేడ నుంచి జనగాం వరకు, వెలిగొండ నుంచి తొర్రూరు వరకు రోడ్ల నిర్మాణం చేపట్టనున్నారు.

రీజనల్‌ రింగ్‌ రోడ్‌ తెలంగాణకు గేమ్‌ చేంజర్‌ అవుతుందన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. మొత్తం 350 కిలోమీటర్ల రీజనల్‌ రింగ్‌ రోడ్డులో 10వేల కోట్లతో 182 కిలోమీటర్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసుకుంటున్నామన్నారు. తెలంగాణలో సుమారు 5వేల కిలోమీటర్ల జాతీయ రహదారి నిర్మాణం జరిగిందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. వచ్చే ఐదేళ్లలో పెద్ద ఎత్తున జాతీయ రహదారుల నిర్మాణం జరగబోతోందన్నారు. హైదరాబాద్‌ నుంచి వరంగల్ వరకు సిమెంట్‌తో నేషనల్‌ హైవే నిర్మించామని ప్రత్యేకంగా చెప్పుకొచ్చారు. తెలంగాణలో జాతీయ రహదారుల కోసం లక్షా 4వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామన్నారు కిషన్ రెడ్డి. జాతీయ రహదారులతో పండిన పంటను వేగంగా తరలించి, అమ్ముకునే వెసులుబాటు రైతులకు కలుగుతుందన్నారు.

జాతీయ రహదారులను జాతికి అంకితం ఇచ్చే కార్యక్రమంలో మంత్రి వేముల కిషోర్‌ మాట్లాడుతుండగా.. జై శ్రీరామ్, జై భారత్‌ అంటూ నినాదాలు చేశారు బీజేపీ కార్యకర్తలు. దీంతో కేంద్రమంత్రి గడ్కరీ సహా వేదికపై ఉన్న బీజేపీ నేతలు షాక్ అయ్యారు. వెంటనే తేరుకున్న కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి.. బీజేపీ కార్యకర్తలపై మండిపడ్డారు. మంత్రి వేముల మాట్లాడుతుండగా అలాంటి స్లోగన్స్ చేయడం కరెక్ట్ కాదని వారించారు. దీంతో బీజేపీ కార్యకర్తలు శాంతించారు.

ఈ కార్యక్రమానికి వెళ్లిన ఎంపీ కోమటిరెడ్డి విజయవాడ, హైదరాబాద్‌ వైవే సమస్యను ప్రస్తావించారు.

Tags

Read MoreRead Less
Next Story