నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికకు కరోనా సెగ

నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికకు కరోనా సెగ
24 మంది స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు పాజిటివ్‌ నిర్థారణ అయ్యింది. దీంతో.. వీరు ఓటు హక్కు ఎలా వినియోగించుకోవాలి..

నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికకు కరోనా సెగ తగిలింది. కరోనా టెస్ట్‌లు చేయించుకున్న 824 మంది ఓటర్లలో 24 మంది స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు పాజిటివ్‌ నిర్థారణ అయ్యింది. దీంతో.. వీరు ఓటు హక్కు ఎలా వినియోగించుకోవాలి అనేదానిపై ప్రత్యమ్నాయాలు సిద్ధం చేస్తున్నారు. కరోనా సోకిన వారు పోస్టల్‌ బ్యాలెట్ లేదా చివరి గంటలో ఓటు వేసేందుకు అవకాశాలు పరిశీలిస్తున్నారు. ఎమ్మెల్సీ ఉపఎన్నిక కోసం మొత్తం 50 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద 4 పీపీఈ కిట్లు అందుబాటులో ఉంచాలని కూడా నిర్ణయించారు.


Tags

Read MoreRead Less
Next Story