కాంగ్రెస్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌కు నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌

కాంగ్రెస్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌కు నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌
కాంగ్రెస్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌కు ప్రజాప్రతినిధుల కోర్టు నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది.

కాంగ్రెస్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌కు ప్రజాప్రతినిధుల కోర్టు నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది. ఎఐంఎం నాయకుడు హుస్సేన్‌ అన్వర్‌ దాఖలు చేసిన పరువు నష్టం కేసుపై కోర్టు విచారణ జరిపింది.. విచారణకు హాజరుకాపోవడంతో ఆయనకు నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది. తదుపరి విచారణ మార్చి 8కి వాయిదా వేసింది.. అలాగే స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డికి కూడా ప్రజాప్రతినిధుల కోర్టు సమన్లు పంపింది.

2005లో టీడీపీ నిర్వహించిన ఆందోళనకు సంబంధించిన కేసులో పోచారంతోపాటు పలువురికి సమన్లు పంపింది.. వరంగల్‌లోని సుబేదారి పీఎస్‌ పరిధిలో ఆందోళన చేపట్టగా.. ఆ కేసు వరంగల్‌ కోర్టు నుంచి ప్రజాప్రతినిధుల కోర్టుకు బదిలీ అయింది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం ఎర్రబెల్లి దయాకర్‌రావు, దేవేందర్‌గౌడ్‌, కడియం శ్రీహరి, వేణుగోపాలచారి, మండవ వెంకటేశ్వరరావు, వేం నరేందర్‌ రెడ్డికి సమన్లు పంపింది.

ఇక కుత్బుల్లాపూర్‌ ఎమ్మెల్యే వివేకానందకు కూడా ప్రజాప్రతినిధుల కోర్టు నోటీసులు జారీ చేసింది. 2016లో నిర్వహించిన ఆందోళనలో వివేకానంద పాల్గొన్నారు. అయితే, ఆయన ప్రస్తుతం రాష్ట్రంలో లేరని జీడిమెట్ల పోలీసులు కోర్టుకు తెలిపారు. వాట్సాప్‌ లేదా మెయిల్‌ ద్వారా సమన్లు పంపాలని కోర్టు ఆదేశించింది.. విచారణ మార్చి 8కి వాయిదా వేసింది.

Tags

Read MoreRead Less
Next Story