తెలంగాణ స్టేట్ అగ్రి యూనివర్శిటీలో నాన్ టీచింగ్ పోస్టులు.. రేపే లాస్ట్ డేట్

తెలంగాణ స్టేట్ అగ్రి యూనివర్శిటీలో నాన్ టీచింగ్ పోస్టులు.. రేపే లాస్ట్ డేట్
పదోతరగతి/తత్సమాన ఉత్తీర్ణతతో పాటు హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. డ్రైవింగ్‌లో అనుభవం ఉండాలి.

రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాఱ స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్శిటీ (పీజేటీఎస్ఏయూ) వివిధ కృషి విజ్ఞాన కేంద్రాల్లో (కేవీకే) నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

ఖాళీలు: 40

ప్రోగ్రాం అసిస్టెంట్

(ఫార్మ్ మేనేజర్, ల్యాబ్ టెక్నీషియన్): 16

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి అగ్రికల్చర్/హార్టికల్చర్/సీఏ అండ్ బీఏ సబ్జెక్టుల్లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.

ప్రోగ్రాం అసిస్టెంట్

(కంప్యూటర్, అసిస్టెంట్): 16

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి అగ్రికల్చర్/హార్టీకల్చర్/సీఏ అండ్ బీఏ సబ్జెక్టుల్లో బ్యాచిలర్ డిగ్రీ/బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పూర్తి చేసిన వారు అర్హులు.

అసిస్టెంట్ పోస్టులకు ఏదైనా బ్యాచిలర్ డిగ్రీతో పాటు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి.

స్టెనోగ్రాఫర్ గ్రేడ్-3 : 8

అర్హత: బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణ, షార్ట్ హ్యాండ్ ఇంగ్లీష్ లోయర్ గ్రేడ్, టైప్ రైటింగ్ ఇంగ్లీష్ లోయర్ గ్రేడ్ టైపింగ్ స్కిల్స్ వచ్చి ఉండాలి.

డ్రైవర్స్: 16

అర్హత: పదోతరగతి/తత్సమాన ఉత్తీర్ణతతో పాటు హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. డ్రైవింగ్‌లో అనుభవం ఉండాలి.

సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష, టైపింగ్ టెస్ట్, డ్రైవింగ్ టెస్ట్ ఆధారంగా సెలెక్షన్ ప్రాసెస్ ఉంటుంది.

కేటగిరి-1: ఈ పోస్టులకు ఉమ్మడి రాత పరీక్షఉంటుంది. దీన్ని ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. ఆబ్జెక్టివ్ టైప్ రూపంలో ప్రశ్నలు ఉంటాయి. ఇందులో 150 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున 150 మార్కులకు దీనిని నిర్వహిస్తారు. పరీక్షా సమయం మూడు గంటలు. ప్రతి తప్పు సమాధానానికి 1/4 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. మెరిట్ ఆధారంగా అభ్యర్థులను సెలెక్ట్ చేస్తారు.

కేటగిరి-2: ఈ పోస్టులకు పార్ట్-ఏ ఆన్లైన్ రాత పరీక్ష, పార్ట్-బి టైపింగ్ టెస్ట్ ఉంటుంది. రాత పరీక్ష ఆబ్జెక్టివ్ రూపంలో ఉంటుంది. జనరల్ నాలెడ్జ్, కరెంట్ ఎఫైర్స్, జనరల్ ఇంగ్లీష్ నుంచి ప్రశ్నలు ఉంటాయి. ఇందులో 120 ప్రశ్నలకు 120 మార్కులు ఉంటాయి. పరీక్షా సమయం రెండున్నర గంటలు. పార్ట్-బిలో టైపింగ్ టెస్ట్ ఉంటుంది. దీనికి 15 నిమిషాల సమయం 30 మార్కులు కేటాయిస్తారు.

కేటగిరి-3: ఈ పోస్టులకు పార్ట్-ఏ డిక్టేషన్ పరీక్ష, పార్ట్-బి టైపింగ్ టెస్ట్ ఉంటుంది. డిక్టేషన్ పరీక్ష ఇంగ్లీషులో ఉంటుంది. పది నిమిషాల సమయంలో నిమిషానికి 80 పదాల చొప్పున టైప్ చేసి దాన్ని 45 నిమిషాల్లో ట్రాన్స్‌లేట్ చేయాలి. ఎగ్జామ్ 70 మార్కులకు ఉంటుంది. పార్ట్-బి టైపింగ్ టెస్ ఉంటుంది. దీనికి 30 నిమిషాల సమయం, 30 మార్కులు కేటాయిస్తారు.

కేటగిరి-4: ఈ పోస్టులకు తరగతులు, డ్రైవింగ్ అనుభవం, డ్రైవింగ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక జరుగుతోంది. దీన్ని మొత్తం 100 మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో పార్ట్-ఏ 15 మార్కులకు, పార్ట్-బి 5 మార్కులు, పార్ట్-సి 80 మార్కులకు ఉంటుంది. పార్ట్-ఏ, బీ, సీ పరీక్షలో మెరిట్ ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది.

దరఖాస్తు చేసుకునే విధానం: ఆన్‌లైన్ ద్వారా చేసుకోవాలి.

దరఖాస్తు ప్రారంభం: జనవరి 7 2021

చివరి తేదీ: జనవరి 19 2021

పరీక్షతేదీ: జనవరి 24, 2021

Tags

Read MoreRead Less
Next Story