తెలంగాణ

Ramachandraiah : 'కంచు తాళం.. కంచు మేళం' రామచంద్రయ్యకు పద్మశ్రీ

Ramachandraiah : భద్రాద్రి జిల్లా కూనవరానికి చెందిన ఆదివాసీ వాద్య కళాకారుడు రామచంద్రయ్య పద్మశ్రీ అవార్డుకు ఎంపికయ్యారు.

Ramachandraiah : కంచు తాళం.. కంచు మేళం రామచంద్రయ్యకు పద్మశ్రీ
X

Ramachandraiah : భద్రాద్రి జిల్లా కూనవరానికి చెందిన ఆదివాసీ వాద్య కళాకారుడు రామచంద్రయ్య పద్మశ్రీ అవార్డుకు ఎంపికయ్యారు. కేంద్ర ప్రభుత్వం 107 మందికి పద్మశ్రీ ప్రకటించగా వారిలో రామచంద్రయ్య స్థానం దక్కించుకున్నారు. ఈయన వోకల్‌, ఫోక్‌ కళాకారుడు. కంచు తాళం కంచు మేళం అనే వాద్య సాధనాన్ని వాయిస్తూ ప్రాచీన కళను కాపాడుతున్నారు. పద్మశ్రీ దక్కిందన్న సమాచారం అందుకున్న గ్రామస్తులు ఆయన ఇంటికి వెళ్లి సన్మానించారు.

ఆయన కుటుంబ సభ్యులు ప్రభుత్వాలకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఆయన ఎంపికపై భద్రాద్రి కలెక్టర్‌ అనుదీప్‌తో పాటు జిల్లాఅధికారులు, ఆదివాసీ సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రామచంద్రయ్య ఆదివాసీ చరిత్రపై పట్టుసాధించి అరుదైన వాద్య పరికరంతో ఏపీ, తెలంగాణతో పాటు ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లో విస్తృతంగా పర్యటించారు. కోయ తెగల చరిత్రను, విశిష్టతను వినసొంపైన రాగంలో వినిపించేవారు.

చదవడం రాకపోయినా... గిరిజన బిడ్డల చరిత్ర అంతా ఆయన నోటిలోనే ఆడుతుంది. ఆదివాసీలు పూజింజే దేవతలు, వారి సంప్రదాయాలు నేటికి పది మందికి చెప్పగలికే తెలివి తేటలు ఆయనలో దాగి ఉన్నాయి. ఎన్ని పుస్తకాలు చదివినా మరునాడు ఉదయానికి మర్చిపోయే ఈ రోజుల్లో పాతకాలపు మనిషిగా రామచంద్రయ్య ఆదివాసీ తెగలో గొప్ప పేరును తీసుకు వచ్చారు.

తన ఇంతటి గొప్ప పురస్కారం దక్కడంతో... భారత ప్రభుత్వానికి.. తెలంగాణ సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ఏర్పడ్డకా... తనకు గుర్తింపు దక్కిందని సంతోషం వ్యక్తం చేశారు.

Next Story

RELATED STORIES