Top

పెట్రోల్‌ బంక్‌ల స్కాం.. ఏపీ, తెలంగాణలో చిప్‌లు ఏర్పాటు

పెట్రోల్‌ బంక్‌ల స్కాం.. ఏపీ, తెలంగాణలో చిప్‌లు ఏర్పాటు
X

పెట్రోల్‌ బంక్‌ల స్కాం.. ఏపీ, తెలంగాణ పెట్రోల్‌ బంకుల్లో చిప్‌లు ఏర్పాటుపెట్రోల్ బంకుల్లో మోసాలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. పెట్రోల్‌ బంకుల్లో చిప్‌లు ఏర్పాటు చేసి మోసాలకు పాల్పడుతున్నట్టు పోలీసులు గుర్తించారు. SOT పోలీసులకు వచ్చిన పక్కా సమాచారంతో పెట్రోల్‌ బంక్‌ల స్కాం బయటపడింది. ఇంటిగ్రేటెడ్‌ చిప్‌తో లీటర్ పెట్రోల్‌కు కేవలం 970 మిల్లీ లీటర్లు మాత్రమే నిండేలా సెట్‌ చేస్తారు. ఆ లెక్కన ప్రతి లీటర్ పెట్రోల్‌పై 30 మిల్లీ లీట్లర్లను మోసం చేస్తున్నారు. తెలంగాణలో 9 మంది పెట్రోల్‌ బంక్ ఓనర్లు అరెస్టు చేసినట్టు సైబరాబాద్‌ సీపీ సజ్జనార్ తెలిపారు. ఆంధ్రలో ఇలాంటి మోసాలకు సంబంధించి 19 మంది అరెస్ట్ అయ్యారు. ఈ స్కాంలో పశ్చిమగోదావరికి చెందిన సుభాని బాషా కీలకపాత్ర పోషించాడు. పెట్రోల్‌ పంప్‌లలో అమర్జే ఇంటిగ్రేటెడ్‌ చిప్‌లను... భాషా.. .ముంబైని తీసుకొచ్చాడు. తెలంగాణలోని 11 పెట్రోల్ బంకుల్లో 13 చిప్‌లు ఏర్పాటు చేశారు. ఒక్కో చిప్‌ను అమర్చడానికి 80 వేల నుంచి ఒక లక్ష రూపాయలు తీసుకున్నట్టు సమాచారం.

Next Story

RELATED STORIES