Modi In Telangana : కుటుంబ పార్టీలకు కుటుంబమే ఫస్ట్ ,వారసత్వ నేతలపై మోదీ విమర్శలు

Modi In Telangana : కుటుంబ పార్టీలకు కుటుంబమే ఫస్ట్ ,వారసత్వ నేతలపై మోదీ విమర్శలు
వారసత్వ నేతల అవినీతిని వెలికితీస్తున్నందుకే వారికి భయం పట్టుకుందన్న మోదీ

అవినీతిని బయటపెడుతున్నామనే అక్కసుతోనే కాంగ్రెస్‌ పార్టీ విమర్శలు చేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ మండిపడ్డారు. కుటుంబ పాలన సాగించేవారిలో అభద్రతా భావం ఎక్కువన్న మోదీ.. వారికి దోచుకునేందుకు లైసెన్స్‌ ఉందా అని ప్రశ్నించారు. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో ఏర్పాటుచేసిన భాజపా విజయ సంకల్ప సభలో ప్రసంగించిన మోదీ.. తెలంగాణ సహా అన్ని రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని స్పష్టంచేశారు. పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా రెండోరోజు సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో విజయ సంకల్ప సభను భాజపా ఏర్పాటు చేసింది. సభాస్థలికి చేరుకున్న మోదీపై.. కార్యకర్తలు పూలవర్షం కురిపించారు.

దేశంలో కుటుంబపార్టీలు ప్రజలను దోచుకుంటున్నాయని నరేంద్ర మోదీ విమర్శించారు. కశ్మీర్‌ నుంచి తమిళనాడు వరకు వారసత్వ పార్టీల కుటుంబాలు బాగుపడితే.. ప్రజలు మాత్రం అక్కడే ఉండిపోయారని మండిపడ్డారు. ప్రజల ఆశీర్వాదంతో వారిని ఓడిస్తామని మోదీ అన్నారు. అన్ని రాష్ట్రాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం కృషిచేస్తోందని.. అందులో భాగంగా తెలంగాణకు పెద్దఎత్తున నిధులు కేటాయించామని మోదీ వెల్లడించారు. కాంగ్రెస్‌, భారాస రెండూ ఒక్కటేన్న ప్రధాని.... ఆ పార్టీలు కుమ్మక్కయ్యాయని విమర్శించారు. కాళేశ్వరం పేరుతో కోట్ల రూపాయలు దోచుకున్నారని మండిపడ్డారు. మాదిగల స్వాధికారత కోసం భాజపా పూర్తి సహకారం అందిస్తుందని మోదీ పునరుద్ఘాటించారు. అందుకోసం ఓ కమిటీని కూడా ఏర్పాటుచేసి పరిష్కారం కోసం కృషిచేస్తునట్టు ఆయన వివరించారు.

నాణేనికి ఒకవైపు బీఆర్ఎస్, మరోవైపు కాంగ్రెస్‌ ఉన్నాయని, ఆ రెండు పార్టీలు కుమ్మక్కయైట్లు ప్రజలందరికీ అర్థమైందని మోదీ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌, బీఆర్ఎస్​ రెండు పార్టీలు ఒక్కటేనని దుయ్యబట్టారు. కాళేశ్వరం పేరుతో కోట్ల రూపాయలు దోచుకున్నారని ఆరోపించారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణను కొత్త ఏటీఎంగా మార్చుకుందని ఆరోపించారు. అనంతరం నేనే మోదీ కుటుంబం అని సభికులతో నినాదాలు చేయించిన ప్రధాని, తెలంగాణ యువత స్వప్నాలను సాకారం చేస్తామని హామీ ఇచ్చారు. ఆ దిశగానే 70 ఏళ్లలో కాంగ్రెస్‌ చేయలేని పనిని పదేళ్లలో చేసి చూపామని ప్రధాని ఉద్ఘాటించారు. కోట్లాది ఎస్సీ యువత స్వప్నాలను సాకారం చేసినట్లు తెలిపిన ప్రధాని, తెలంగాణలో మాదిగల అభ్యున్నతి కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

Tags

Read MoreRead Less
Next Story