తెలంగాణ

వరదల్లో ఇంటి పట్టాలు పోగొట్టుకున్న వారికి కొత్త పట్టాలు ఇప్పిస్తాం: కిషన్ రెడ్డి

ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద సొంతంగా ఇళ్లు కట్టుకోవాలనుకునే వారికీ అండగా ఉంటామన్నారు కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి.

వరదల్లో ఇంటి పట్టాలు పోగొట్టుకున్న వారికి కొత్త పట్టాలు ఇప్పిస్తాం: కిషన్ రెడ్డి
X

ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద సొంతంగా ఇళ్లు కట్టుకోవాలనుకునే వారికీ అండగా ఉంటామన్నారు కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి. ఆదాయం, స్థలాన్ని బట్టి ఇంటికి రుణం కూడా మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. మొన్నటి వరదల్లో పట్టాలు పోగొట్టుకున్న వారికి తిరిగి కొత్త పట్టాలు ఇచ్చే ప్రయత్నం చేస్తామని చెప్పారు. ముషీరాబాద్ నాగమయ్య కుంటలో జరిగిన బీజేపీ బస్తీ సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హాజరయ్యారు.

దేశవ్యాప్తంగా మోదీ లక్షల ఇళ్లు కట్టిస్తుంటే.. తెలంగాణ ప్రభుత్వం శ్రద్ద చూపట్లేదని విమర్శించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చొరవతో త్వరలోనే ఇళ్ల సమస్య కూడా తీరుతుందన్నారు లక్ష్మణ్. నమ్మకంతో బీజేపీ కార్పొరేటర్లను గెలిపించినందుకు ధన్యవాదాలు చెప్పారు ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు లక్ష్మణ్. బస్తీలో డ్రైనేజి, రోడ్ల సమస్యలు పూర్తిగా పరిస్కారం అయ్యాయని చెప్పారు.


Next Story

RELATED STORIES