పోలీస్ అధికారి సాయాన్ని గుర్తుంచుకున్న మహిళ

పోలీస్ అధికారి సాయాన్ని గుర్తుంచుకున్న మహిళ
హఠాత్తుగా పోలీస్ అధికారి ఎదురుపడటంతో ఆనందంతో కంటతడి

చేసిన సాయాన్ని గంటల్లో మరిచిపోతున్న ఈ రోజుల్లో... ఓ మహిళ పదేళ్ల క్రితం పోలీస్ అధికారి తనకు చేసిన మేలును గుర్తుంచుకుంది. హఠాత్తుగా ఆ పోలీస్ అధికారి ఎదురుపడటంతో ఉబ్బితబ్బిబ్బయింది. ఆనందంతో కంటతడి పెట్టుకుంది. ఈ ఘటన సికింద్రాబాద్‌లో చోటు చేసుకుంది.

ఆర్పీ రోడ్‌లో ఓ మహిళ వేగంగా పరిగెత్తుకుంటూ వెళ్లడం చూసి అందరూ బస్సు కోసం వెళ్తుందేమోనని అనుకున్నారు. కానీ సదరు మహిళ అక్కడ మంత్రి తలసాని బందోబస్తు విధుల్లో ఉన్న ఏసీపీని కలవడానికి వెళ్లడం చూసి అంతా ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం మహంకాళి ఏసీపీగా ఉన్న రవీందర్‌ 2014 లో టప్పాచ భుత్ర ఇన్స్ పెక్టర్‌గా ఉన్నప్పుడు కార్వాన్‌కు చెందిన కవిత అనారోగ్యంతో రోడ్డుపై పడిపోయింది. వెంటనే స్పందించిన రవీందర్‌... ఆమెను ఆస్పత్రిలో చేర్పించి సొంత డబ్బులతో ఆపరేషన్‌ చేయించారు. ఆ తర్వాత ఆమే కోలుకుని మాములు మనిషి అయింది.

సికింద్రాబాద్‌ ఆర్పీ రోడ్డులో బస్సులో వెళ్తున్న ఆమె.. రోడ్డుపై విధుల్లో ఉన్న ఏసీపీ శ్రీనివాస్‌ను గుర్తు పట్టింది. వెంటనే బస్సు దిగి.. పరిగెత్తుకుంటూ వచ్చి ఏసీపీని కలిసింది. తాను బతికి ఉన్నానంటే మీ దయే సార్ అంటూ కన్నీరు పెట్టుకుంది. మీ కోసం వెండి రాఖీ తెచ్చి కడుతానని ఆనందం వ్యక్తం చేసింది. మహిళా ఫోన్‌లో ఉన్న ఏసీపీ ఫోటో చూసి ఆమె కృతజ్ఞతక.. అంతా ఆశ్చర్య పోయారు. ఏసీపీ ఫోన్ నెంబర్ తీసుకోని ఆనందంగా వెళ్లి పోయింది.

Tags

Read MoreRead Less
Next Story