BRS: లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటేందుకు పార్టీలు సమాయుక్తం

BRS: లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటేందుకు పార్టీలు సమాయుక్తం
ఉమ్మడి మెదక్‌ జిల్లా ప్రత్యేక శ్రద్ద

లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటేందుకు పార్టీలు సమాయత్తమలోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటేందుకు పార్టీలు సమాయత్తమవుతున్నాయి. అసెంబ్లీ పోరులో అధిక సీట్లు సాధించి అధికారం చేపట్టిన కాంగ్రెస్‌.. పార్లమెంట్‌ సమరంలో విజయఢంకా మోగించాలని కృతనిశ్చయంతో ఉంది. సిట్టింగ్‌ స్థానం కోల్పోకుండా భారాస ప్రణాళికలు రచిస్తుండగా.. కేంద్రంలో తిరిగి అధికారంలోకి వస్తామనే ధీమాతో ఉన్న భాజపా అధిక సీట్లు సాధించేందుకు కసరత్తులు చేస్తుంది.

ఉమ్మడి మెదక్‌ జిల్లాలో మెదక్‌, జహీరాబాద్‌ రెండు పార్లమెంట్‌ స్థానాలున్నాయి. కంచుకోటగా ఉన్న మెదక్‌ స్థానాన్ని మరోసారి చేజిక్కించుకోవాలని భారాస ప్రయత్నాలు చేస్తుంది. ఆ నియోజకవర్గాన్ని దక్కించుకొని గులాబీ పార్టీని దెబ్బతీయాలని కాంగ్రెస్‌, భాజపా ప్రణాళికలు రచిస్తున్నాయి. ఆ స్థానంలో విజయం సాధిస్తే మిగతాచోట్ల గెలుస్తామన్న సెంటిమెంట్‌తో మెదక్‌ నియోజకవర్గంలో పాగావేసేందుకు అన్ని పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటికే తమ అనుచరులతో ప్రచారాన్ని ముమ్మరం చేసిన పార్టీల అభ్యర్థులు.. తమకే అవకాశం వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో 10అసెంబ్లీస్థానాల్లో గత ఎన్నికల్లో ఏడింటిని భారాస కైవసం చేసుకుంది.

ఈసారి భారాస అధికారంలో లేకపోవడంతో.. ప్రధాన పార్టీలు ఆ జిల్లాపై కన్నేశాయి. కాంగ్రెస్‌ నుంచి మెదక్‌ MPస్థానాన్ని మైనంపల్లి హనుమంతరావు, నీలం మధు ముదిరాజ్‌ ఆశిస్తున్నారు. ప్రస్తుతం తన కుమారుడు మైనంపల్లి రోహిత్‌రావు మెదక్‌ ఎమ్మెల్యేగా ఉండటంతో... ఎంపీ టికెట్‌ ఇవ్వాలని అధిష్ఠానంపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. మెదక్ పార్లమెంట్‌ స్థానంలో దాదాపు 5లక్షలపైచిలుకు ముదిరాజ్‌ ఓట్లు ఉండటంతో నీలం మధుకు టికెట్‌ ఇస్తే గెలిచి తీరతానని అధిష్టానానికి హమీఇచ్చినట్లు ప్రచారం సాగుతోంది. కాగా.. సామాజిక కార్యక్రమాలు మధుకి కలిసొస్తాయని ఆయన అనుచరులు చెబుతున్నారు..

భాజపా నుంచి దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు, ఆకుల రాజయ్య పేర్లు వినిపించినా.. ప్రస్తుతం పటాన్‌చెరులోని పారిశ్రామిక వేత్త అంజిరెడ్డి పేరు ప్రచారంలోకి వచ్చింది. ఆయన సతీమణీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలుగా ఉండటం.. పార్టీతో సత్సంబంధాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం కొత్తవారికి అవకాశం ఇస్తే పార్టీకిసైతం కొంత బలం చేకూరుతుందని భావిస్తున్నట్లు సమాచారం. వీరిద్దరూ పార్టీలోని పెద్దలను ప్రసన్నం చేసుకునేలా ఇప్పటికే ప్రయత్నాలు మెుదలుపెట్టినట్లు తెలుస్తుంది.

భారాస విషయానికి వస్తే ప్రస్తుతం వంటేరు ప్రతాప్‌రెడ్డి పేరు వినిపిస్తుంది. ఆయనతోపాటు కాంగ్రెస్‌ నుంచి పార్టీ మారి భారాసలో చేరిన గాలి అనిల్‌కుమార్‌ పోటీపడుతున్నట్లు సమాచారం. ఎంపీ టికెట్‌ ఆశించే పార్టీలో గాలి అనిల్‌ చేరినట్లు అనుచరులు చెబుతున్నారు. కానీ ప్రతాప్‌రెడ్డికి స్వయంగా మాజీ సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చినట్లు సమాచారం.

Tags

Read MoreRead Less
Next Story