PM Modi: ఆదిలాబాద్‌లో రూ.56 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రధాని శంఖుస్థాపన,

PM Modi: ఆదిలాబాద్‌లో రూ.56 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రధాని  శంఖుస్థాపన,
తెలంగాణ అభివృద్ధి కట్టుబడి ఉన్నామన్న ప్రధాని మోదీ

రాష్ట్రాలు అభివృద్ధి చెందితేనే దేశం ప్రగతిపథంలో వెళ్తుందనే విధానంతోనే పాలన సాగిస్తున్నామని.... ప్రధాని నరేంద్రమోదీ స్పష్టం చేశారు. ఆదిలాబాద్‌లో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన మోదీ పదేళ్లలో తెలంగాణ ఆకాంక్షలు నెరవేర్చేలా పూర్తి సహకారమందించామని తెలిపారు. మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగేలా భారత్‌ వేగంగా అడుగులు వేస్తోందని పేర్కొన్నారు.

లోక్‌సభ ఎన్నికల ముంగిట ప్రధాని నరేంద్రమోదీ ఆదిలాబాద్‌లో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. దిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో నాగపూర్‌కు చేరుకున్న ప్రధాని మోదీ.. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో ఆదిలాబాద్ చేరుకున్నారు. ఇందిరా ప్రియదర్శిని మైదానంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి 6 వేల 700 కోట్లతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు వర్చువల్‌గా భూమిపూజ, జాతికి అంకితం చేశారు. 800 మెగావాట్ల రెండో దశ విద్యుత్ కేంద్రాన్ని రామగుండం NTPC ప్రాజెక్టు, అంబారి-ఆదిలాబాద్ -పింపల్ కుట్టి విద్యుద్ధీకరణ ప్రాజెక్టులను ప్రధాని జాతికి అంకితం చేశారు. డబ్లింగ్, విద్యుదీకరించిన సనత్ నగర్- మౌలాలి మార్గాన్ని ప్రదాని ప్రారంభించారు.

కేంద్రంతో ఘర్షణాత్మక వైఖరి రాష్ట్రాభివృద్ధికి ఆటంకమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితెలిపారు. ఎన్నికల సమయంలోనే రాజకీయాలు చేయాలి కానీ రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రంతో కలిసి ముందుకు వెళ్తామని స్పష్టంచేశారు. NTPC విద్యుత్‌ ప్లాంట్‌నిర్మాణానికి ప్రభుత్వం తరుఫున పూర్తిగా సహకరిస్తామని రేవంత్‌ హామీ ఇచ్చారు. ప్రధాని మోద తమకు పెద్ద అన్న వంటి వారన్న రేవంత్ ..గుజరాత్‌ తరహాలో తెలంగాణకు సహకారమందిచాలని కోరారు. తుమ్మడిహట్టి ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా మహారాష్ట్రలో ముంపునకు గురయ్యే 1850 ఎకరాలకు ఎలాంటి పరిహారానైనా ఇచ్చేందుకు సిద్ధమని రేవంత్‌రెడ్డి తెలిపారు. మహారాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడితే అనుమతి ఇప్పిస్తే.... ఆదిలాబాద్‌కు సాగునీళ్లు వస్తాయని పేర్కొన్నారు..

మా దృష్టిలో ప్రధానమంత్రి అంటే పెద్దన్న. ఈ పెద్దన్న సహకారం ఉంటేనే ఏ ముఖ్యమంత్రి అయినా వారి రాష్ట్రంలో అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లగలుగుతారు. ఇందుకోసమే తెలంగాణగుజరాత్‌ తరహాలో అభివృద్ధిలో ముందుకెళ్లాలన్న మీ మద్దతు తప్పనిసరి. మీ లక్ష్యమైన 5ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యాన్ని చేరుకునేందుకు.. దేశంలోని ఐదు మెట్రోపాలిటన్‌ నగరాల్లో ఒకటైనా హైదరాబాద్‌ భాగస్వామ్యుల్ని చేయాలి. ఇందుకోసం మెట్రోరైల్‌, మూసీ అభివృద్ధిలో మద్దతు ఇవ్వండి. సెమీకండక్టర్‌ పరిశ్రమ ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాం. ఇటీవల కేంద్రప్రభుత్వం సెమీ కండక్టర్‌ పరిశ్రమకు రాయితీలు, ప్రోత్సాహాకాల ప్రకటించింది. హైదరాబాద్‌ అందుకు అత్యంత అనువైన ప్రాంతం. 5ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థలో భాగస్వామ్యులయ్యేందుకు సిద్ధంగా ఉన్నాం.

రాష్ట్రాల అభివృద్ధితోనే దేశం అభివృద్ధి అనే విధానంతోనే కేంద్ర ప్రభుత్వ పాలన సాగుతోందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. జాతీయ రహదారులు వివిధ అంశాల్లో పదేళ్లలో తెలంగాణ అభివృద్ధికి పూర్తిస్థాయిలో అండగా నిలిచినట్లువివరించారు.

ల్వేస్టేషన్ల అభివృద్ధి, జాతీయ రహదారులు వంటి అనేక అంశాల్లో కేంద్రం పూర్తిగా సహకరిస్తోందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. తెలంగాణ అభివృద్ధికి మోదీ ప్రభుత్వం నిధులు అందిస్తోందని స్పష్టం చేశారు

Tags

Read MoreRead Less
Next Story