PRIYANKA: తెలంగాణను ఎలా నడిపించాలో తెలుసు

PRIYANKA: తెలంగాణను ఎలా నడిపించాలో తెలుసు
ఒక్క అవకాశం ఇవ్వండి... తెలంగాణ రూపురేఖలు మార్చేస్తాం... ప్రజలకు ప్రియాంక గాంధీ పిలుపు

తెలంగాణను ఎలా ముందుకు నడిపించాలో కాంగ్రెస్‌కు తెలుసని కాంగ్రెస్‌ ముఖ్యనేత ప్రియాంకగాంధీ స్పష్టం చేశారు. ఖానాపూర్‌, ఆసిఫాబాద్‌లలో ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొన్నారు. తొలుత ఖానాపూర్‌లో సభలో పాల్గొన్న ప్రియాంక గిరిజనులు, ఆదివాసీల అభివృద్ధికిఇందిరాగాంధీ కృషి చేశారని గుర్తు చేశారు. నసీఎం కేసీఆర్‌ విధానాలవల్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని ప్రియాంక మండిపడ్డారు. యువతకు ఉద్యోగాలు ఇవ్వని కేసీఆర్ తన కుటుంబంలో మాత్రం నలుగురికి ఉద్యోగాలు ఇచ్చారని ఆక్షేపించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం రాగానే జాబ్‌ క్యాలెండర్‌ ఇచ్చి 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. తెలంగాణలో బీజేపీ, బీఆర్‌ఎస్‌, MIM కలిసే ఉన్నాయని ఆరోపించారు.


అనంతరం ఆసిఫాబాద్‌ సభలో పాల్గొన్న ప్రియాంక కాళేశ్వరంపై, ఢిల్లీ మద్యం స్కామ్‌పై ప్రధాని నరేంద్రమోదీ మాటలకే పరిమితమవుతున్నారని ధ్వజమెత్తారు. అవినీతి జరిగిందంటూనే ఎందుకు విచారణ జరిపించడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో ప్రజలు సంతోషంగా ఉన్నారన్న ప్రియాంక ఒక్క అవకాశమిస్తే తెలంగాణలో కూడా రైతులకు ఎన్నో ప్రయోజనాలు కల్పిస్తామన్నారు. ద్యమ అమరవీరుల ఆకాంక్షలు నెరవేరటం లేదని.. ప్రియాంక ఆందోళన వ్యక్తం చేశారు. పదేళ్లు బీఆర్‌ఎస్ పాలనలో.. తెలంగాణ వెనక్కిపోయిందన్నారు. ఖానాపూర్‌, ఆసిఫాబాద్‌లో సభల తర్వాత ప్రియాంక గాంధీ నాందేడ్‌ చేరుకుని అక్కడి నుంచి ఢిల్లీ వెళ్లారు.


ఇటు కాంగ్రెస్‌ అభ్యర్థులు కూడా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. కూకట్‌పల్లి కాంగ్రెస్‌ అభ్యర్థి బండి రమేశ్‌ బాలాజీనగర్ డివిజన్‌లోని ఖైత్లాపుర్‌లో ఇంటింటికి వెళ్లి, ఓట్లు అభ్యర్థించారు. ముషీరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి అంజన్‌కుమార్‌యాదవ్‌కు మద్దతుగా ఆయన కుటుంబసభ్యులు ప్రచారం నిర్వహించారు. ఖమ్మం జిల్లా బోనకల్, చింతకాని మండలాల్లో మధిర కాంగ్రెస్ అభ్యర్థి, CLP నేత భట్టి విక్రమార్క ప్రచారం నిర్వహించారు. APPCC కార్యనిర్వాహక అధ్యక్షుడు మస్తాన్‌అలీ భట్టి మద్దతుగా ప్రచారంలో పాల్గొన్నారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ ఏజెన్సీ ప్రాంతంలో ములుగు కాంగ్రెస్‌ అభ్యర్థి సీతక్క ప్రచారం నిర్వహించారు. ఆదివాసీ నృత్యాలతో ఆమెకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు కాంగ్రెస్‌లో చేరారు. డోర్నకల్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌ అభ్యర్థి రామచంద్రనాయక్‌ కురవి మండలం నేరడ, తులస్యాతండా, లచ్చిరాం తండాలో పర్యటించి ఓట్లు అభ్యర్థించారు. కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి వొడితెల ప్రవీణ్‌ జమ్మికుంట, ఇల్లందకుంట మండలాల్లో ప్రచారం చేశారు. మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ అభ్యర్థి ఆవుల రాజిరెడ్డిని గెలిపించాలంటూ... AICC ప్రధాన కార్యదర్శి మీనాక్షి నటరాజన్ నియోజకవర్గంలో ప్రచారం చేశారు. మెదక్‌ జిల్లా చిన్న శంకరంపేట మండలంలోని గ్రామాలు, తండాల్లో నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి మైనంపల్లి రోహిత్‌ ఓట్లు అభ్యర్థించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్‌కు మద్దతుగా ఆ పార్టీ నేత తీన్మార్ మల్లన్న ప్రచారం చేశారు.

Tags

Read MoreRead Less
Next Story