RAHUL: కాళేశ్వరం... కేసీఆర్‌ కుటుంబానికి ఏటీఎం

RAHUL: కాళేశ్వరం... కేసీఆర్‌ కుటుంబానికి ఏటీఎం
నాసిరకం పనుల వల్లే మేడిగడ్డ కుంగిపోయిందన్న రాహుల్‌.. కేసీఆర్ దోపిడీ సొమ్మును ప్రజల ఖాతాల్లో జమ చేస్తాం..

నాసిరకం పనుల వల్లే మేడిగడ్డ బ్యారేజీ స్థంభాలు కుంగిపోయాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. మేడగడ్డను పరిశీలించిన రాహుల్‌ కేసీఆర్‌, ఆయన కుటుంబానికి కాళేశ్వరం ATMలా మారిందని ఆరోపించారు. సర్కారు దోపిడీ వల్ల ప్రజలు మూల్యం చెల్లించాల్సి వస్తోందన్నారు. దోపిడీ సొమ్మును ప్రజల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణలో మూడోరోజు పర్యటించిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ ఇటీవల పిల్లర్‌ కుంగిన మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించారు. రాహుల్‌తోపాటు కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు అక్కడకు వెళ్లడంతో స్వల్పఉద్రిక్తత చోటు చేసుకుంది. భారీ సంఖ్యలో వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అడ్డుకోగా వారు ఆందోళనకు దిగారు. భూపాలపల్లి జిల్లాలోని వివిధ గ్రామాల సర్పంచులు, ZPTC, MPTCలు సహా కార్యకర్తలు ధర్నాలో పాల్గొన్నారు. మేడిగడ్డ బ్యారేజ్ సందర్శనకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. భద్రతా కారణాలరీత్యా అనుమతివ్వలేమని పోలీసులు చెప్పారు. MLA శ్రీధర్‌బాబు కార్యకర్తలకు సర్దిచెప్పడంతో వారు శాంతించారు.


అంతకుముందు భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్ మండలం అంబట్ పల్లిలో మహిళా సాధికారత సదస్సులో రాహుల్ పాల్గొన్నారు. కాళేశ్వరం KCR కుటుంబానికి ATMలా మారిందని ఆరోపించారు. పర్యటన ముగిసిన తర్వాత మేడిగడ్డ బ్యారేజీని తాను సందర్శించినట్లు రాహుల్‌ గాంధీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కేసీఆర్ కుటుంబం ATMగా మారిందన్నారు. నాసిరకం నిర్మాణం కారణంగా స్తంభాలకు పగుళ్లు ఏర్పడ్డాయని..అవి మునిగిపోతున్నట్లు నివేదికలు వచ్చాయని విమర్శించారు. కాళేశ్వరం టీఆర్‌ఎస్‌కు ఏటీఎం అన్న రాహుల్‌.. దీన్ని కొంచెం మార్చి కాళేశ్వరం కేసీఆర్‌కు ఏటీఎం అని మీరు రాసుకోవాలన్నారు. కేసీఆర్ కుటుంబ సభ్యుల ఏటీఎం అని... ఈ ఏటీఎంను నడిపించేందుకు తెలంగాణలోని ప్రతి కుటుంబం ఏడాదికి రూ. 31,500 చొప్పున 2040 వరకు కట్టాలన్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుందని, ఎంత డబ్బు తెలంగాణ ముఖ్యమంత్రి ప్రజల నుంచి దోచుకున్నారో అంత డబ్బును మేము తెలంగాణ ప్రజల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తాంమన్నారు.


కేసీఆర్ కుటుంబ అవినీతికి కాళేశ్వరం ప్రాజెక్ట్‌ బలైపోయిందని PCC అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. లక్ష కోట్లు ఖర్చుచేసి నిర్మించిన ప్రాజెక్టు ఎందుకూ పనికిరాకుండా పోయిందని CLP నేత భట్టి విక్రమార్క ఆవేదన వ్యక్తం చేశారు. పర్యటన ముగిసిన తర్వాత మేడిగడ్డ సందర్శించినట్లు.. రాహుల్‌ గాంధీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. నాసిరకం నిర్మాణం కారణంగా స్తంభాలకు పగుళ్లు ఏర్పడ్డాయని.. అవి మునిగిపోతున్నట్లు నివేదికలు వచ్చాయని విమర్శించారు.

Tags

Read MoreRead Less
Next Story