Top

హైదరాబాద్‌ను వదలని వరుణుడు.. మరో రెండ్రోజుల పాటు వర్షాలు..!!

హైదరాబాద్‌ను వదలని వరుణుడు.. మరో రెండ్రోజుల పాటు వర్షాలు..!!
X

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్రరూపం దాల్చడంతో... హైదరాబాద్‌లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు గ్రేటర్‌ పరిధిలోని లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. రోడ్లు జలమయం అయ్యాయి. ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. గత మూడ్రోజులుగా వర్షాలు కురుస్తునే ఉన్నాయి. భారీ వర్షానికి రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి.

మరో రెండ్రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో జీహెచ్‌ఎంసీ అప్రమత్తమైంది. అనవసరంగా ప్రజలెవరూ బయటకు రావద్దని సూచించారు. మరోవైపు పురాతన ఇళ్లలోని ప్రజలను ఖాళీ చేయించి, కూల్చివేతలు చేస్తున్నారు. నగరంలో నీరు నిలిచే 150 ప్రాంతాలను గుర్తించారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు అలర్ట్‌గా ఉండాలని హెచ్చరించారు జీహెచ్‌ఎంసీ అధికారులు. ఎలాంటి విపత్తు వచ్చిన ఎదుర్కోవడానికి జీహెచ్ఎంసీ సిద్ధంగా ఉందని తెలిపారు. 90కి పైగా మాన్సూన్, డిజాస్టర్ బృందాలు రెడీ చేసినట్లు తెలిపారు.

Next Story

RELATED STORIES