పుట్ట మధు పై పోలీసులు ప్రశ్నల వర్షం..!

పుట్ట మధు పై పోలీసులు ప్రశ్నల వర్షం..!
పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధు పై పోలీసులు ప్రశ్నల వర్షాన్ని కురిపిస్తున్నారు. ACP స్థాయి అధికారి ఆధ్వర్యంలో రెండవరోజు పుట్టమధు విచారణ కొనసాగుతోంది.

పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధు పై పోలీసులు ప్రశ్నల వర్షాన్ని కురిపిస్తున్నారు. ACP స్థాయి అధికారి ఆధ్వర్యంలో రెండవరోజు పుట్టమధు విచారణ కొనసాగుతోంది. న్యాయవాది వామన్ రావు హత్య కేసులో విచారణను రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణ ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. ఈ మర్డర్ కేసులో రెండు కోట్ల రూపాయలు చేతులు మారడం పై క్లారిటీ వచ్చిందనే సంకేతం కనిపిస్తుంది.

పుట్ట మధుతో పాటు మరికొందరని ఈ కేసులో చేర్చుతారని సమాచారం. ఇప్పటికే జంట హత్యల కేసులో కీలక విషయాలు ఆధారాలతో సహా..వామాన్ రావు తండ్రి కిషన్ రావు పోలీసులకు అందజేశారు. మరోవైపు పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ మారుతరంటూ రాజకీయ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇక అటు పోలీసులు ఫోన్ చేయడంతో తో రామగుండం పోలీస్ కమిషనరేట్ కు పుట్టమధు భార్య అయిన పుట్ట శైలజ వచ్చారు.

అటు హత్యకు గురైన గట్టు వా రావు..తండ్రి కిషన్ రావు కూడా కమిషనరేట్ కు పోలీసులు తీసుకెళ్లారు. వామన్ రావు దంపతుల హత్య కేసులో రెండు కోట్ల రూపాయల లావాదేవీలు కీలకంగా మారాయి. ఇక ఇదే అంశంపై రామగుండం పోలీస్ కమిషనరేట్ లో విచారణ కొనసాగుతుంది.

అటు పది రోజులు అజ్ఞాతంలో ఉన్న పుట్టమధు అరు సిమ్ లు, నాలుగు వాహనాలు మార్చినట్లు పోలీసులు గుర్తించారు. ఏ క్షణమైనా ప్రెస్ మీట్ పెట్టి పోలీసులు కీలక విషయాలు వెల్లడించి అవకాశం ఉంది.

Tags

Read MoreRead Less
Next Story