పెద్ద సంస్కరణలు తీసుకొచ్చినప్పుడు కొన్ని సమస్యలు సహజమే : కేటీఆర్‌

పెద్ద సంస్కరణలు తీసుకొచ్చినప్పుడు కొన్ని సమస్యలు సహజమే : కేటీఆర్‌

అభివృద్ధి, జన హితమే.. టీఆర్‌ఎస్‌ అజెండా అన్నారు ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌. ఆరేళ్లలో జరిగిన ప్రగతిని చూసి తమను ఆశ్వీర్వదించాలన్నారు. మతరాజకీయలు చేస్తున్న వారిని బలంగా తిప్పికొట్టాలని హైదరాబాదీయులను కోరారు. క్రేడాయ్‌ హైదరాబాద్‌ ఆధ్వర్యంలో జరిగిన రియల్‌ ఎస్టేట్‌ సమ్మిట్‌ -2020 సదస్సులో ఆయన మాట్లాడారు. నాలుగు ఓట్లు, నాలుగు సీట్ల కోసం నగరానికి అగ్గిపెట్టి వెళ్తే తర్వాత దాన్ని ఎవరూ ఆర్పుతారని ప్రశ్నించారు మంత్రి కేటీఆర్‌. హైదరాబాద్‌ పేరు మారుస్తామని బీజేపీ నేతలు అంటున్నారని, నేమ్‌ చేంజర్‌ కావాలా? గేమ్‌ చేంజర్‌ కావాలా? అని ప్రశ్నించారు.

వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొన్ని ఇబ్బందులున్న మాట వాస్తవమేనన్నారు మంత్రి కేటీఆర్‌. పెద్ద సంస్కరణలు తీసుకొచ్చినప్పుడు కొన్ని సమస్యలు సహజమేనని చెప్పారు. అవసరమైతే పాత పద్ధతిలోనే మళ్లీ రిజిస్ట్రేషన్లు జరిగేలా చూస్తామన్న ఆయన.. త్వరలోనే సమస్య పరిష్కరం అవుతుందని ఆశిస్తున్నానన్నారు. రియల్‌ ఎస్టేట్‌ 2020 సదస్సులో పాల్గొన్న కేటీఆర్‌.. పారదర్శక రిజిస్ట్రేషన్ల కోసమే ధరణి తీసుకొచ్చామని స్పష్టం చేశారు.


Tags

Read MoreRead Less
Next Story