రంగు మారింది.. రుచి ఎలా ఉంటుంది!!

రంగు మారింది.. రుచి ఎలా ఉంటుంది!!
చిన్న పిల్లలు కూడా ఇష్టంగా తినే ఈ బెండకాయలు ఇప్పుడు రంగు మారి కొత్తగా కనువిందు చేస్తున్నాయి.

అందరికీ తెలిసినవి ఆకుపచ్చని బెండకాయలు. బేండీ ప్రై బ్రహ్మాండంగా ఉంటుంది. చిన్న పిల్లలు కూడా ఇష్టంగా తినే ఈ బెండకాయలు ఇప్పుడు రంగు మారి కొత్తగా కనువిందు చేస్తున్నాయి.వరంగల్ అర్బన్ జిల్లా హసన్ పర్తి మండలం పెంబర్తికి చెందిన ప్రభాకర్ రెడ్డి తన పొలంలో ఈ రకం బెండను పండిస్తున్నారు.

సేంద్రియ విధానంలో బెండ కాయలను సాగు చేస్తున్నట్లు రైతు పేర్కొన్నారు. వంగడం పేరు రాధిక అని.. వరంగల్‌లో కొనుగోలు చేశానని తెలిపారు. పంట దిగుబడి ఆశాజనకంగా ఉందని వివరించారు. పోషకాల పరంగా చూసినా ఎర్రబెండలో ఎన్నో సూక్ష్మపోషకాలు ఉన్నాయని వరంగల్ ఉద్యానశాఖ అధికారి సుద్దాల శంకర్ తెలిపారు.

రక్తహీనత సమస్యతో బాధపడేవారు తమ ఆహారంలో ఎర్ర బెండను తీసుకుంటే ఉపయోగకరంగా ఉంటుందని ఆయన అన్నారు. చీడ పీడల బెడద ఉండదని ఈ రకం పంటలను రైతులు సాగు చేయడానికి ఇష్టపడుతున్నారు. ఈ ఎర్ర బెండను ఎక్కువగా బెంగళూరు, సిమ్లా వంటి చల్లని వాతావరణంలో సాగు చేస్తారని రైతు వివరించారు.

Tags

Read MoreRead Less
Next Story