ప్రఖ్యాత రేడియాలజిస్ట్, నిమ్స్ మొదటి డైరెక్టర్ కాకర్ల సుబ్బారావు మృతి

ప్రఖ్యాత రేడియాలజిస్ట్, నిమ్స్ మొదటి డైరెక్టర్ కాకర్ల సుబ్బారావు మృతి
ప్రఖ్యాత రేడియాలజిస్ట్, హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్ మరియు నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) యొక్క మొదటి డైరెక్టర్ డాక్టర్ కాకర్ల సుబ్బారావు శుక్రవారం తెల్లవారుజామున సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో మరణించారు.

ప్రఖ్యాత రేడియాలజిస్ట్, హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్ మరియు నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) యొక్క మొదటి డైరెక్టర్ డాక్టర్ కాకర్ల సుబ్బారావు శుక్రవారం తెల్లవారుజామున సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో మరణించారు. ఆయన వయసు 94 సంవత్సరాలు. వయస్సు సంబంధిత వ్యాధులకు చికిత్స తీసుకునేందుకు గాను ఆయన ఇటీవలే కిమ్స్‌లో అడ్మిట్ అయ్యారు.

క‌ృష్ణా జిల్లా పెదముత్తేవిలో జనవరి 25, 1925 న వ్యవసాయ కుటుంబంలో జన్మించిన కాకర్ల ఆంధ్ర మెడికల్ కాలేజీ నుండి ఎంబిబిఎస్ చేసారు. ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లిన ఆయన రెండు సంవత్సరాలు అక్కడ పని చేసి 1956లో స్వదేశానికి తిరిగి వచ్చారు.

అనంతరం నిమ్స్ అధిపతిగా బాధ్యతలు స్వీకరించారు. నిమ్స్ ఆసుపత్రిని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా తీర్చి దిద్దిన ఘనత డాక్టర్ సుబ్బారావుకు దక్కుతుంది.

కాకర్ల 1985-86లో భారతదేశానికి తిరిగి రాకముందు న్యూయార్క్ లోని ఆల్బర్ట్ ఐన్స్టీన్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్ లో రేడియాలజీ ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తించారు. ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావు పిలుపుతో ప్రభావితమైన ఆయన నిమ్స్‌లో చేరి ఆసుపత్రి అభివృద్ధికి కృషి చేశారు. వైద్య రంగంలో ఆయన చేసిన విలువైన సేవలకుగాను భారత ప్రభుత్వం 2000 సంవత్సరంలో కాకర్ల సుబ్బారావును పద్మశ్రీతో సత్కరించింది.

ప్రస్తుతం ఉన్న మహమ్మారి పరిస్థితి కారణంగా, కాకర్ల మృతికి సంబంధించిన స్మారక సమావేశాలు నిర్వహించబడవని కుటుంబసభ్యులు తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story