Top

వాగులో చిక్కుకున్న ఇద్దరు రైతులను కాపాడిన గజ ఈతగాళ్లు

వాగులో చిక్కుకున్న ఇద్దరు రైతులను కాపాడిన గజ ఈతగాళ్లు
X

నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌లో వాగులో చిక్కుకున్న ఇద్దరు రైతులను సురక్షితంగా కాపాడారు. మల్లాపూర్‌ మండలం సిర్పూర్‌ గ్రామానికి చెందిన ఇద్దరు కౌలు రైతులు.. సదుర్మాట్‌కుర్రులో పొలం వద్దకు వెళ్లారు. పందుల బారి నుంచి పంటను కాపాడుకోవడానికి కావాలి కోసం.. రాత్రి పొలం వద్ద వెళ్లారు. ఐతే ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో కురుస్తోన్న భారీ వర్షాలకు సదుర్మాట్‌ పయ ఉప్పొంగింది. ఒక్కసారిగా భారీగా వరద పోటెత్తడంతో రైతులు అక్కడే చిక్కుకుపోయారు. విషయం తెలియడంతో.. పోలీస్‌, ఫైర్‌ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. జాలర్ల సహాయంతో.. ఇద్దరు రైతులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు దీంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.. రైతులను కాపాడిన గజఈతగాళ్లను అభినందించారు అధికారులు.

Next Story

RELATED STORIES