Singareni: సింగరేణి గనిలో చిక్కుకున్న ముగ్గురు కార్మికులు.. కొనసాగుతున్న సహాయక చర్యలు..

Singareni: సింగరేణి గనిలో చిక్కుకున్న ముగ్గురు కార్మికులు.. కొనసాగుతున్న సహాయక చర్యలు..
Singareni: పెద్దపల్లి జిల్లా రామగుండం ఆండ్రియాల లాంగ్‌ వాల్‌ ప్రాజెక్టులో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Singareni: పెద్దపల్లి జిల్లా రామగుండం ఆండ్రియాల లాంగ్‌ వాల్‌ ప్రాజెక్టులో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పైకపుకూలిన ఘటనలో ముగ్గురు ఉద్యోగులు గనిలో చిక్కుకోవడంతో వారికోసం గాలింపుచర్యలు ముమ్మరం చేశారు. సింగరేణి డైరెక్టర్లు బలరాం, చంద్రశేఖర్, సత్యనారాయణ లు బొగ్గుగనిలోకి దిగి క్షేత్రస్థాయిలో పనులను పరిశీలిస్తున్నారు. సహాయక చర్యలను ముమ్మరం చేయాలని ఆదేశించారు.

సింగరేణి బొగ్గుగని పైకప్పు కూలిన ప్రమాదంలో ఇద్దరు అధికారులు సహా ఆరుగురు ఉద్యోగులు గనిలో చిక్కుకున్నారు. రామగుండం-3 పరిధిలోని ఆండ్రియాల లాంగ్‌వాల్‌ ప్రాజెక్టు భూగర్భ గనిలో ఈ దుర్ఘటన జరిగింది. నిన్ననే ఇద్దరిని సురక్షితంగా బయటకు తీసిన సింగరేణి సిబ్బంది.. మరో నలుగురి ఆచూకీ కోసం సహాయక చర్యల్ని ముమ్మరం చేశారు.

ఈక్రమంలో సిబ్బందికి ఇవాళ ఓ కార్మికుడిని బయటకుతీశారు. అతడు 19 గంటలతర్వాత సురక్షితంగా బయట పడ్డాడు. బొగ్గు శకలాల కింద విలవిల్లాడి.. మృత్యుంజయుడిగా బయటకువచ్చారు. ఇక మిగిలిన ముగ్గురు కార్మికుల కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రామగుండం-3 పరిధిలోని అడ్రియాల లాంగ్‌వాల్‌ ప్రాజెక్టు భూగర్భ గనిలోని 86 లెవల్‌ వద్ద వారం రోజుల క్రితం పైకప్పు కూలిందని.. దాన్ని సరిచేసేందుకు ఉద్యోగులతో సపోర్టింగ్‌ పనులు నిర్వహించారు.

ఈక్రమంలో నిన్న మధ్యాహ్నం ఒకటిన్నర గంటల సమయంలో ఒక్కసారిగా సైడ్‌తో పాటు పైకప్పు కూలింది. దీంతో పైభాగంలో పనిచేస్తున్న కార్మికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగుతీశారు. మిగిలిన ఆరుగురు గనిలోనే శకలాల కింద చిక్కుకుపోయారు. సింగరేణి రెస్క్యూ ఆపరేషన్‌లో నిన్ననే ఇద్దరు కార్మికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. వీరికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story