AP: మెగా మాస్టర్‌ పాలసీ అమలు చేస్తాం

AP: మెగా మాస్టర్‌ పాలసీ అమలు చేస్తాం
పారిశ్రామిక వృద్ధే లక్ష్యమన్న రేవంత్‌రెడ్డి... రాష్ట్రమంతా అభివృద్ధే లక్ష్యమని ప్రకటన

2050 నాటికి తెలంగాణ అంతటా పారిశ్రామిక వృద్ధి జరగాలనే లక్ష్యంతో మెగా మాస్టర్ పాలసీ రూపొందిస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టంచేశారు. హైదరాబాద్ మాదిరి రాష్ట్రమంతటా అభివృద్ధి చేస్తామన్నారు. పారిశ్రామికాభివృద్ధి కేంద్రీకృతం కాకుండా అన్నిప్రాంతాల్లో జరగాలన్నారు. బల్క్ డ్రగ్ ఉత్పత్తి సంస్థల అసోసియేషన్ ప్రతినిధులతోసీఎం సమావేశమయ్యారు. తెలంగాణను 3 క్లస్టర్లుగా విభజించనున్నట్లు వివరించారు. ఔటర్ రింగ్ రోడ్డు లోపల అర్బన్ క్లస్టర్, అవుటర్ -రీజనల్ రింగ్ రోడ్డుల మధ్య సెమీఅర్బన్ క్లస్టర్, రీజనల్ రింగ్ రోడ్డు తర్వాత రూరల్ క్లస్టర్ ఏర్పాటు చేస్తామన్నారు. పెట్టుబడులు ఆహ్వానించేలా ఫ్రెండ్లీ పారిశ్రామిక విధానం అమలు చేస్తామని రేవంత్ తెలిపారు.


అన్ని రంగాల పరిశ్రమలకు ప్రోత్సాహం కల్పిస్తామని రేవంత్‌ తెలిపారు. ఒకేచోట ఫార్మాసిటీ కాకుండా ఫార్మా విలేజీలు అభివృద్ధి చేస్తామన్నారు. వెయ్యి నుంచి 3వేల ఎకరాలకొక ఫార్మా విలేజ్ అభివృద్ధి చేస్తామని చెప్పారు. జహీరాబాద్ లో ఐటీ, ఫార్మా, హెల్త్ , ఫుడ్ ప్రాసెసింగ్, స్పోర్ట్స్, ఆటోమొబైల్, ఆర్గానిక్ పరిశ్రమలు ఏర్పాటు చేస్తామన్నారు. రక్షణ, నావికా రంగం పరికరాల తయారీకి అపార అవకాశాలు ఉన్నాయని చెప్పారు. కొత్తగా సోలార్ పవర్ పాలసీని రూపొందిస్తామని, సోలార్ ఎనర్జీ పరిశ్రమలకు తగిన ప్రోత్సాహకాలు ఇస్తామని పేర్కొన్నారు. తెలంగాణలో 35 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారన్న రేవంత్ వారిలో నైపుణ్యాల పెంపునకు స్కిల్ వర్శిటీలు పెడతామన్నారు. స్కిల్ యూనివర్సిటీల్లో డిగ్రీలు పొందినవారు ప్రపంచంలో ఎక్కడైనా నిలదొక్కుకునేలా చూస్తామని రేవంత్ చెప్పారు.


మరోవైపు తెలంగాణలో మరిన్ని పెట్టుబడులకు వెల్ స్పాన్ గ్రూప్ సంసిద్ధత వ్యక్తంచేసింది. సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన.... వెల్ స్పాన్ గ్రూప్ చైర్మన్ బి.కె. గోయెంకా చందన్ వ్యాలీ పారిశ్రామిక విభాగంలో ప్రారంభించిన ఐటీ సేవలలో 250 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టనున్నట్టు తెలిపారు. రెండో, మూడోశ్రేణి పట్టణాల్లో ఐటీ అభివృద్ధికి... తాము సహకరిస్తామని, వికారాబాద్, అదిలాబాద్ జిల్లాల్లో యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు సిద్ధంగా ఉన్నట్టు గోయంకా తెలిపారు.

తెలంగాణను మూడు క్లస్టర్లుగా విభజించనున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తెలిపారు. ఔటర్‌ రింగ్ రోడ్డు లోపల ప్రాంతం అర్బన్‌ క్లస్టర్‌గా, ఓఆర్‌ఆర్‌ - ఆర్ఆర్‌ఆర్‌ మధ్య ప్రాంతాన్ని సెమీ అర్బన్‌ క్లస్టర్‌, ఆర్‌ఆర్‌ఆర్‌ తర్వాత ప్రాంతమంతా రూరల్‌ క్లస్టర్‌గా విభజించనున్నట్లు సీఎం చెప్పారు. సచివాలయంలో సీఐఐ ప్రతినిధులతో సీఎం రేవంత్‌ సమీక్ష నిర్వహించారు. పెట్టుబడులు ఆహ్వానించేలా ఫ్రెండ్లీ పారిశ్రామిక విధానం అమలు చేస్తామని... హైదరాబాద్‌ తరహాలో రాష్ట్రమంతటా అభివృద్ధి చేస్తాం. అన్నిరంగాల పరిశ్రమలకు ప్రోత్సాహం కల్పిస్తామని తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story