Revanth Reddy: రాష్ట్రంలో సరైన వ్యవసాయ విధానం లేదు- రేవంత్‌ రెడ్డి

Revanth Reddy: రాష్ట్రంలో సరైన వ్యవసాయ విధానం లేదు- రేవంత్‌ రెడ్డి
Revanth Reddy: సీఎం కేసీఆర్‌కు టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ రాశారు.

Revanth Reddy: సీఎం కేసీఆర్‌కు టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ రాశారు. మిర్చి, పత్తి రైతుల సమస్యల పరిష్కారంపై రేవంత్ లేఖ రాశారు. రాష్ట్రంలో సరైన వ్యవసాయ విధానం లేదని, అందువల్లే... రైతులు అనేక సమస్యలతో ఆత్మహత్య చేసుకుంటున్నారన్నారు. మిర్చి, పత్తి రైతుల పరిస్థితి తనను కలిచివేసిందన్నారు. ఈ రైతుల పరిస్థితిని ప్రభుత్వం దృష్టికి తెచ్చే ప్రయత్నం చేసినట్లు తెలిపారు.

ఒక్క మహబూబాబాద్‌ జిల్లాలో రెండు నెలల్లో 20మంది ఆత్మహత్య చేసుకున్నట్లు లేఖలో వివరించారు. ప్రతి రైతుకు ఆరు నుంచి 12 లక్షల వరకు అప్పు ఉందని, ఆ అప్పుల బాధతోనే రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారన్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు 25 లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని లేఖలో కోరారు. అలాగే వెంటనే లక్ష రూపాయల రుణమాఫీ అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.

Tags

Read MoreRead Less
Next Story