తెలంగాణా సాగునీటి ప్రాజెక్టులపై రౌండ్ టేబుల్ సమావేశం

తెలంగాణా సాగునీటి ప్రాజెక్టులపై రౌండ్ టేబుల్ సమావేశం
తెలంగాణాలో ఉన్న 2వేల 604 మేగావాట్ల విద్యుత్ ప్రాజెక్టులను చంపడానికి కేసీఆర్ కంకణం కట్టుకున్నారన్నారు రేవంత్ రెడ్డి

తెలంగాణాలోని సాగునీటిప్రాజెక్టుల నిర్మాణంపై హైదరాబాద్‌లోని లక్టీకపూల్‌ సెంట్రల్ హాల్‌లో రౌండ్‌టేబుల్ సమావేశం జరిగింది. టీ- జర్నలిస్టు ఫోరమ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో అఖిలపక్షనేతలు పాల్గొని తెలంగాణాలో పెండింగ్ ప్రాజెక్టులపై చర్చించారు. దశాబ్దాలుగా ఆచరణకు నోచుకోని సాగునీటి ప్రాజెక్టును సత్వరమే పూర్తిచేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాళేశ్వరం రీడిజైనింగ్‌ను వారు తప్పుపట్టారు.

కాళేశ్వరం రిడిజైన్ చేయకపోతే తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రాజెక్టులు పూర్తయ్యేవన్నారు టీ.జే.ఎస్ అధ్యక్షులు, ప్రొఫెసర్ కోదండరామ్. రిడిజైన్ ఏ హేతుబద్ద చర్చలేకుండా తయారుచేశారని ఆయన విమర్శించారు. ఆచరణకు నోచుకోని సాగునీటి ప్రాజెక్టులను వెంటనే పూర్తిచేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

తెలంగాణ వస్తే మహబూబ్ నగర్ జిల్లాకు మంచి జరుగుతుందని భావించానని, కానీ ఈనాటికి అది జరుగలేదన్నారు మాజీ ఎంపి జితేందర్ రెడ్డి. జిల్లాలో 20లక్షల ఎరాలు సాగుకావాల్సి ఉండగా.. కేవలం లక్ష ఎకరాలు మాత్రమే సాగువుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

కేసీఆర్ ఆరు సంవత్సరాల పాలనలో రాష్ట్రం అప్పులపాలైందన్నారు టీటీడీపీ అధ్యక్షులు ఎన్ రమణ. ఏపీ ప్రభుత్వం కృష్ణా జలాల దోపిడీని తెలుగుదేశం పార్టీ అడ్డుకుంటుందన్నారు.

కృష్ణాజలాలను తెలంగాణా కేవలం 1 టీఎంసీ వాడుకుంటుంటే.. ఆంధ్రప్రదేశ్ మాత్రం ఏకంగా 12 టీఎంసీలను వాడుకుంటుందని ఆవేదన వ్యక్తంచేశారు మల్కాజ్‌గిరి ఎంపి రేవంత్ రెడ్డి. తెలంగాణాలో ఉన్న 2వేల 604 మేగావాట్ల విద్యుత్ ప్రాజెక్టులను చంపడానికి కేసీఆర్ కంకణం కట్టుకున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.

Tags

Read MoreRead Less
Next Story