RTC Bus : 26 ఏళ్ల తర్వాత మావోయిస్టు ప్రభావిత గ్రామానికి ఆర్టీసీ బస్సు

RTC Bus : 26 ఏళ్ల తర్వాత మావోయిస్టు ప్రభావిత గ్రామానికి ఆర్టీసీ బస్సు
RTC BUS : దట్టమైన అటవీ ప్రాంతంలో 26 ఏళ్ల తర్వాత ఓ మావోయిస్టు ప్రభావిత గ్రామానికి బస్సు సర్వీసు పునరుద్దరించారు.

RTC BUS : దట్టమైన అటవీ ప్రాంతంలో 26 ఏళ్ల తర్వాత ఓ మావోయిస్టు ప్రభావిత గ్రామానికి బస్సు సర్వీసు పునరుద్దరించారు. కొమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా తిర్యాణి మండలంలో ఉన్న మంగి గ్రామానికి బస్సు సర్వీసులను జెండా ఊపి ప్రారంభించారు ఎస్పీ సుధీంద్ర. ప్రజలు ఆర్టీసీ సేవలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పోలీసులు.. మీ కోసం కార్యక్రమంలో భాగంగా మంగి ఘాట్‌ రోడ్డుకు మరమ్మతులు, ప్రజల కోసం ఆరోగ్య శిబిరాలు నిర్వహించామన్నారు. అసాంఘిక శక్తులకు ఎట్టి పరిస్థితుల్లో సహకరించొద్దని కోరారు. స్థానిక సమస్యలను తమ దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ఎస్పీ సంప్రదాయంగా పూజలు నిర్వహించారు. టికెట్‌ కొని బస్సులో మంగి నుంచి తిర్యాణి వరకు డీఎస్పీ శ్రీనివాస్‌, ఆర్టీసీ డీఎం సుగుణాకర్‌, ఇతర అధికారులతో కలిసి ప్రయాణించారు.

Tags

Read MoreRead Less
Next Story