Sangareddy: ఇటుక బట్టీలో... బాలికల నరకయాతన

Sangareddy: ఇటుక బట్టీలో... బాలికల నరకయాతన
సంగారెడ్డి ఇటుకుల తయారీ కారాగారంపై దాడి చేసిన చైల్డ్ ప్రొటెక్షన్ సెల్ అధికారులు; 7గురు బాలికల సహా 54మందికి విముక్తిచ విస్తుపోయే వాస్తవాలు...

సంగారెడ్డి జిల్లాలోని నారాయణ్ ఖేడ్ వద్ద దర్గా తండాలో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ఇసుకబట్టిపై చైల్డ్ ప్రొటెక్షన్ సెల్ అధికారులు నిర్వహించిన ఆకస్మిక దాడిలో విస్తుపోయే వాస్తవాలు బయట పడ్డాయి. అక్రమంగా తలరించిన కూలీలతో బట్టీ నిండిపోయిందన్న సమాచారం అందుకున్న అధికారులు, పోలీసుల సహాయంతో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 54మంది కూలీలను అక్రమార్కుల చెర నుంచి విడిపించారు. వీరిలో ఏడుగురు 15ఏళ్ల లోపు బాలికలు కావడంతో అధికారులు విస్తుపోయారు. అత్యంత దర్భరమైన పరిస్థితుల్లో చిన్నారులు రేయి పగలు అన్న తేడా లేకుండా పని చేస్తున్న వైనాన్ని కళ్లారా చూసి చెలించిపోయారు. దాదాపు కూలీలు అందరూ ఒడిషా నుంచి తీసుకురాగా, చిన్నారులు తాము ఎదుర్కొన్న సమస్యలను అధికారులకు మొరపెట్టుకున్న వైనం కంటతడి పెట్టిస్తోంది. చాలిచాలని తిండి పెట్టి, ఠారెత్తించే ఎండల్లో పనిచేయిస్తున్నారని వాపోయారు. బాలికల్లో కొంతమంది లైంగిక వేధింపులకు సైతం గురైనట్లు తెలుస్తోంది. రోజుకు రూ.1000 ఇస్తామని నమ్మబలికి ఇప్పుడు కనీసం రూ.500 కూడా ఇవ్వడంలేదని కూలీలు వాపోయారు. ఇక బాలికలను హుటాహుటిన సంగారెడ్డిలోని సఖి సెంటర్ కు తరలించారు. మిగిలిన కూలీలను ఓడిషాకు పంపే ఏర్పాట్లు చేస్తున్నారు. బాలికలను సైతం తమ ఇళ్లకు పంపే ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా శిశు సంరక్షణా అధికారి రత్నం, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ యాదగిరి(నారాయణ్ ఖేడ్), ప్రవీణ్(జహీరాబాద్), యాదయ్య(సంగారెడ్డి), చైల్డ్ వెల్ఫేర్ లింగం, కౌన్సిలర్ యాదగిరి, చైల్ట్ లైన్ సోషల్ వర్కర్ రాణి, నవనీత ఓ బృందంగా ఏర్పడి ఇసుకబట్టీపై దాడులు నిర్వహించారు. స్టేట్ లేబర్ డిపార్ట్మెంట్ దృష్టికి ఈ కేసును తీసుకువెళ్లగా, దీనిపై హైదరాబాద్ జోన్ జాయింట్ కమిషనర్ దర్యప్తు చేపట్టనున్నట్లు తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story