బాత్‌రూములు శుభ్రం చేస్తున్న బడిపిల్లలు..

బాత్‌రూములు శుభ్రం చేస్తున్న బడిపిల్లలు..
చదువుకోవాల్సిన బాలికలు శానిటైజర్ వర్కర్లుగా మారారు. పుస్తకాలు పట్టుకోవాల్సిన చేతులతో అక్కడి విద్యార్థినులు మరుగుదొడ్లు శుభ్రం చేస్తున్నారు.

చదువుకోవాల్సిన బాలికలు శానిటైజర్ వర్కర్లుగా మారారు. పుస్తకాలు పట్టుకోవాల్సిన చేతులతో అక్కడి విద్యార్థినులు మరుగుదొడ్లు శుభ్రం చేస్తున్నారు. ఈ దృశ్యం సిద్దిపేట జిల్లా తొగుట మండలం రాంపూర్‌లోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల, కళాశాలలో వెలుగుచూసింది. కళాశాల ప్రిన్సిపాల్ మరుగుదొడ్లు శుభ్రం చేయాలని విద్యార్థినులకు ఆదేశించింది. దీంతో చేసేది లేక గురుకుల బాలికలు చీపుర్ల పట్టుకొని గదులు, బాత్‌రూమ్ శుభ్రం చేస్తున్నారు.

ఇదే విషయాన్ని కళాశాల ప్రిన్సిపాల్ ఉషా కిరణ్‌ను వివరణ కోరేందుకు ప్రయత్నించారు విద్యార్థి నాయకులు. అయితే గత పది రోజుల నుండి ప్రిన్సిపాల్ సెలవుల్లో ఉందని హాస్టల్ సిబ్బంది తెలిపారు. వైస్ ప్రిన్సిపాల్‌ మీనాక్షిని ఫోన్ చేసి ఆరా తీశారు విద్యార్థి నాయకులు. వర్కర్లు రాని సమయంలో విద్యార్థినిలతో శుభ్రం చేయించమని ప్రిన్సిపాల్ చెప్పారని వైస్ ప్రిన్సిపాల్ తెలిపింది.

సోషల్ మీడియాలో బాలికలు మరుగుదొడ్ల క్లీనింగ్ వీడియోపై దుమారం రేగడంతో ఆ విద్యార్థినులు తమ గురుకులానికి చెందిన వారు కాదని వైస్ ప్రిన్సిపాల్ బుకాయించారని విద్యార్థి నాయకులు మండిపడుతున్నారు. విద్యాశాఖ అధికారులు వెంటనే స్పందించి గురుకుల కళాశాల ప్రిన్సిపాల్‌పై చర్యలు తీసుకోవాలని.. లేకుంటే కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్తామని విద్యార్థి నేత విభిషన్ హెచ్చరించారు.

Tags

Read MoreRead Less
Next Story