Hyderabad Rains : డేంజర్ జోన్‌లో హైదరాబాద్.. నగరాన్ని ఇవి ముంచెత్తనున్నాయా..?

Hyderabad Rains : డేంజర్ జోన్‌లో హైదరాబాద్.. నగరాన్ని ఇవి ముంచెత్తనున్నాయా..?
Hyderabad Rains : హైదరాబాద్‌ను నగరంలో ఉన్న జలాశయాలే ముంచెత్తే పరిస్థితి నెలకొంది.

Hyderabad Rains : మహానగరానికి మహావిలయం తప్పదా.. వాన గండం ముంచుకొస్తుందా. జంట నగరాలను జంట జలశయాలు ముంచేస్తాయా. 1998 నాటి జలప్రళయం మళ్లీ రాబోతుందా.. పరిస్థితిని చూస్తే.. కాదనలేని దుస్థితి. ముసీ నది ఉప్పొంగుతోంది. హుస్సేన్ సాగర్ ఉరకలేస్తోంది. మరోవైపు కుండపోత వర్షాలు. అసలు నగరం సేఫ్ జోన్ లో ఉందా.. డేంజర్ జోనులో జారుకుందా? వాతావరణశాఖ ఏం చెబుతోంది. అధికారయంత్రాంగం ఏం చర్యలు చేపట్టనుంది.

చిన్న చినుకు పడినా మహానగరంలో పెద్ద వరదలు ఉప్పొంగుతాయి. నాలాలు కట్టలు తెంచుకుంటాయి. అదే కుండపోత వర్షం కురిస్తే.. అది కూడా ఏకదాటిగా కురిస్తే.. నగరం నరకం కావడం ఖాయం. ఇప్పుడు హైదరాబాద్ లో అదే స్విచ్ వేషన్‌ కనిపిస్తోంది. బ్యాక్ టు బ్యాక్ వర్షాలు పడతున్నాయి. జలశయాలు ముంచెత్తడానికి కాసుక్కుర్చున్నాయి. వాతావరణం చల్లబడుతుంటే.. నగరవాసి గుండె హడలెత్తిపోతున్నాయి.

నగర ప్రజలు అర్థరాత్రి ప్రశాంతంగా నిద్రించిన వేళ.. వరుణుడు మేల్కొన్నాడు. నగరంపై అటాక్ చేసినట్టే వర్షం కురుపించాడు. అదేదో ఉక్రెయిన్‌పై రష్యా దాడిచేసినట్లు వీర కొట్టుడు కొట్టాడు. ఇదేం వానరా బాబోయ్ అని జనాలను ఉలిక్కిపడేలా చేశాడు.

ఓల్డ్‌సిటీలో అయితే వాన బీభత్సంగా పడింది. చంద్రాయణగుట్ట, చార్మినార్, బహదూర్‌పురా, రాజేంద్రనగర్, ఫలక్‌నుమా ఏరియాల్లో 9 సెంటీమీటర్ల వాన పడింది. కొన్ని ప్రాంతాల్లో అయితే 10సెంటిమీటర్లకు తగ్గేదె లే అన్నట్లు వానలు కురిశాయి. దీంతో డ్రైనేజీలు, నాలాల్లో వరదలు ఊహించనంత వేగంగా ఉరకలెత్తుతున్నాయి.

హుస్సేన్ సాగర్‌కు వరద ప్రవాహం వేగంగా పెరుగుతోంది. వచ్చిన వరదను వచ్చినట్లుగా తూముల ద్వారా మూసీలోకి వదులుతున్నారు అధికారులు. దీనికి తోడు మరో రెండు రోజులు వర్షాలు బీభత్సంగా పడతాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. అదే నిజమైతే.. పరిస్థితిని ఊహించలేం.

జంటశలశయాలు నగరంపై జలఖడ్గం విసరక తప్పేలా లేదు. హుస్సేన్ సాగర్ దిగువన నివాసముంటున్న వారు, మూసీ పరీవాహకప్రాంతాల్లో ఉండే వారు అలర్ట్ కావాల్సిన సమయం ఆసన్నమైంది. ఏం కాదులే.. వరదలు వచ్చినప్పుడు చూద్దాంలే అనుకుంటే అంతే సంగతీ. వీలైతే ఉన్నపలంగా బట్టలు సర్దేసుకోని సురక్షిత ప్రాంతాలకు వెళ్లడం బెటర్ అని అధికారులు హెచ్చరిస్తున్నారు.

నిన్న రాత్రి వర్షం చేసిన బీభత్సానికి ఇంకా కోలుకోకముందే.. వాతావరణశాఖ మరో పిడుగులాంటి వార్తను రిలీజ్ చేసింది. ఇవాళ కూడా అదే రేంజ్ లో అదే జోరుతో వానలు కురుస్తాయని హెచ్చరించింది. IMD ప్రకటనతో తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. జీహెచ్‌ఎంసీ, జలమండలి, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లను సీఎస్ అప్రమత్తం చేశారు. ప్రాణ నష్టం జరగకుండా చర్యలుచేపట్టాలని ఆదేశించారు. పునరావాస కేంద్రాలను సిద్ధం చేయాలని సూచించారు.

వాతావరణశాఖ హెచ్చరికలు.. వర్షం పడే తీరు చూస్తుంటే.. జంట నగరాలు.. జలనగరాలుగా మారే అవకాశం లేకపోలేదు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అలెర్ట్‌గా ఉండాల్సిన అవసరం వచ్చింది. లేదంటే వరదలు చెప్పకుండా చుట్టాల్లా వచ్చి చుట్టుసుకొని పోతాయి జాగ్రత్త. ఆలస్యం చేయకండి.. అశ్రద్ధ అసలే చేయకుండి. అప్రమత్తతే మన ఆయుధం. అత్యవసరమైతేనే కాలు బయటపెట్టండి. లేదంటే ఏ వానలోనో.. ఏ వరదల్లోనూ చిక్కుకో తప్పదు.

Tags

Read MoreRead Less
Next Story