మంత్రి హరీష్‌రావును కలిసిన సింగపూర్‌ హైకమిషనర్‌..!

మంత్రి హరీష్‌రావును కలిసిన సింగపూర్‌ హైకమిషనర్‌..!
తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్‌రావును మర్యాదపూర్వకంగా కలిశారు సింగపూర్ హైకమిషనర్ సైమన్ వాంగ్‌.

తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్‌రావును మర్యాదపూర్వకంగా కలిశారు సింగపూర్ హైకమిషనర్ సైమన్ వాంగ్‌. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంతో ఏర్పడిన తెలంగాణ.. అన్ని రంగాల్లో సీఎం కేసీఆర్ నేతృత్వంలో ముందుకు దూసుకెళ్తోందని హరీష్‌ రావు వారికి చెప్పారు. పెట్టుబడులకు హైదరాబాద్ నగరం అత్యంత అనువైన ప్రాంతమన్నారు. డేటా సెంటర్ల ఏర్పాటు, గ్రీన్ ఎనర్జీ, ఫార్మా రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు తమ దేశ కార్పోరేట్ కంపెనీలు ఆసక్తితో ఉన్నట్లు సింగపూర్ హైకమిషనర్ అన్నారు. డేటా సెంటర్లకు హైదరాబాద్ అత్యంత అనువైనదని, ఇప్పటికే అమెజాన్ వంటి సంస్థలు తమ కార్యాలయాలు ఇక్కడ ఏర్పాటు చేశాయన్నారు.


రాష్ట్ర ప్రభుత్వం సకల సౌకర్యాలతో ఫార్మా సిటీని ఏర్పాటు చేస్తోందన్నారు మంత్రి హరీష్‌రావు. తెలంగాణ రాష్ట్రం వ్యాక్సిన్ హబ్‌గా మారిందన్నారు. అంతే కాకుండా సోలార్ వంటి రంగాల్లో పెట్టుబడులకు తెలంగాణ రాష్ట్రం అనువైందని చెప్పారు. ఏడాది పొడవునా సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చన్నారు. మౌళిక సదుపాయాలు, నాణ్యమైన విద్యుత్, రహదారులు, ఎయిర్ పోర్టు, శాంతిభద్రతల విషయంలో తెలంగాణ ప్రాంతం, హైదరాబాద్ నగరం పెట్టుబడులకు స్వర్గధామమని వివరించారు.


ప్రపంచంలోనే అతి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ కాళేశ్వరం ప్రాజెక్టని మంత్రి హరీష్‌రావు వివరించారు. వ్యవసాయంలో ఏడున్నరేళ్ల కాలంలో సమూల మార్పులు సీఎం కేసీఆర్ తీసుకువచ్చారన్నారు. రైతుల ఆత్మహత్యలను పూర్తి స్థాయిలో తగ్గించినట్లు తెలిపారు. ఈ ఫలితంగా తెలంగాణ రాష్ట్రం వరి ధాన్యం ఉత్పత్తిలో అగ్రస్థానంలో నిలిచిందన్నారు హరీష్‌రావు. కేవలం పట్టణాలు, నగరాలే కాకుండా పల్లెలలోను సమూలంగా మార్పులు తెచ్చామన్నారు.

Tags

Read MoreRead Less
Next Story