సింగరేణి కాలరీస్‌ ఎడ్యుకేషనల్ సొసైటీలో ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ ఆధారంగా భర్తీ

సింగరేణి కాలరీస్‌ ఎడ్యుకేషనల్ సొసైటీలో ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ ఆధారంగా భర్తీ
వీటిలో టీచింగ్, నాన్ టీచింగ్, ఇతర పోస్టులు ఉన్నాయి

తెలంగాణ (భద్రాద్రి కొత్తగూడెం)లోని సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ఆధ్వర్యంలో నడుస్తున్న సింగరేణి కాలరీస్ ఎడ్యుకేషనల్ సొసైటీ (ఎస్‌సీఈఎస్) ఒప్పంద ప్రాతిపదికన సంబంధిత స్కూల్స్/కాలేజీల్లో 78 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. వీటిలో టీచింగ్, నాన్ టీచింగ్, ఇతర పోస్టులు ఉన్నాయి. టెస్ట్/డెమో కమ్ ఇంటర్వ్యూ ఆధారంగా ఈ పోస్టులను భర్తీ చేస్తారు. ఆసక్తిగల అభ్యర్ధులు ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుకు ఆఖరు తేదీ డిసెంబర్ 7. అభ్యర్థులు పూర్తి వివరాలకు http://www.sces.co.in/ వెబ్‌సైట్ చూడొచ్చు.

మొత్తం ఖాళీలు: 78

టీచింగ్ స్టాఫ్: 44

నాన్ టీచింగ్ స్టాఫ్: 19

క్లాస్ (4) ఎంప్లాయీస్: 15

ముఖ్య సమాచారం:

అర్హత: పదవరతరగతి (క్లాస్ -4), సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత, బీఈడీ, ఎంఫిల్/పీహెచ్‌డీ & నెట్/స్టెట్ అర్హతతో పాటు అనుభవం ఉండాలి.

వయసు: 01.07.2020 నాటికి 18-44 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: టెస్ట్/డెమో కమ్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తుకు చివరి తేది: డిసెంబర్ 07, 2020.

చిరునామా: సింగరేణి కాలరీస్ ఎడ్యుకేషనల్ సొసైటీ (ఎస్‌సీఈఎస్), భద్రాద్రి కొత్తగూడెం-507101 తెలంగాణ.

Tags

Read MoreRead Less
Next Story