SSC Question Paper Leak : వరుస లీకులతో ప్రభుత్వం అలర్ట్..!

SSC Question Paper Leak : వరుస లీకులతో ప్రభుత్వం అలర్ట్..!
మరోసారి ఎటువంటి అవాంచనీయ ఘటనలూ జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టింది.

తెలంగాణలో టెన్త్‌ క్వశ్చన్‌ పేపర్‌ లీకేజీ వ్యవహారం.. తీవ్ర కలకలం రేపుతోంది. తొలిరోజు వికారాబాద్‌ జిల్లాలో, రెండో రోజు కరీంనగర్‌ జిల్లాలో క్వశ్చన్‌ పేపర్‌లు పరీక్షలు ప్రారంభమైన కాసేపటికే సోషల్‌ మీడియాలో ప్రత్యక్షం కావడంతో ప్రభుత్వం అప్రమత్తమై.. మరోసారి ఎటువంటి అవాంచనీయ ఘటనలూ జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టింది. పరీక్షా కేంద్రంలోకి ప్రవేశించేవారికి మొబైల్‌ ఫోన్‌ అనుమతి లేదని విద్యాశాఖ ఇప్పటికే అన్ని పరీక్షా కేంద్రాలకు ఆదేశాలు జారీ చేసింది. ఇదిలా ఉంటే తాజాగా రాచకొండ సీపీ చౌహాన్‌.. ఇవాళ ఎల్బీ నగర్‌లోని టెన్త్‌ ఎగ్జామ్స్‌ జరుగుతున్న పరీక్షా కేంద్రాలను పరిశీలించారు. తనిఖీల్లో భాగంగా ఎగ్జామ్‌ సెంటర్‌లోకి వెళ్తున్న కమిషర్‌ని ఆపిన కల్పన.. మొబైల్‌ లోపలికి అనుమతి లేదని తీసుకుంది. వెంటనే సీపీ తన ఫోన్‌ను ఆమెకు ఇచ్చారు. ఇక నిబంధనలను గుర్తు చేసి డ్యూటీ సక్రమంగా చేసినందుకు సదరు మహిళా కానిస్టేబుల్‌ కల్పనను మొచ్చుకుని 5వందల రూపాయల రికార్డ్‌ ఇచ్చి అభినందించారు. పరీక్ష కేంద్రాల లోపలికి వెళ్లేటప్పుడు గేట్‌ వద్ద డ్యూటీ చేస్తున్న అధికారులు.. ప్రతి ఒక్కరినీ తనిఖీలు చేయాలని సూచించారు. పరీక్షా కేంద్రాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలూ జరగకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

Tags

Read MoreRead Less
Next Story