KCR : యాసంగిలో రాష్ట్రప్రభుత్వం కిలో వడ్లు కూడా కొనలేదు : కేసీఆర్

KCR : యాసంగిలో రాష్ట్రప్రభుత్వం కిలో వడ్లు కూడా కొనలేదు : కేసీఆర్
KCR : కేంద్ర ప్రభుత్వం యాసంగిలో వరిధాన్యం కొనబోమని పదేపదే చెప్తున్న నేపథ్యంలో... రాష్ట్రప్రభుత్వం కిలో వడ్లు కూడా కొనలేదన్నారు సీఎం కేసీఆర్

KCR : కేంద్ర ప్రభుత్వం యాసంగిలో వరిధాన్యం కొనబోమని పదేపదే చెప్తున్న నేపథ్యంలో... రాష్ట్రప్రభుత్వం కిలో వడ్లు కూడా కొనలేదన్నారు సీఎం కేసీఆర్. యాసంగిలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు పెట్టడం లేదని మరోసారి తేల్చి చెప్పారు. కేంద్రం అనుసరిస్తున్న ప్రమాదకర విధానాల నుంచి రైతుల్ని కాపాడుకునేందుకు క్షేత్రస్థాయిలోకి వెళ్లాలని జిల్లా కలెక్టర్లు, వ్యవసాయ అధికారుల్ని ఆదేశించారు. యాసంగిలో ధాన్యం కొనబోమనే విషయాన్ని రైతులకు అర్థమయ్యేలా వివరించాలన్నారు. ప్రగతి భవన్లో మంత్రులు, జిల్లా కలెక్టర్లతో అత్యున్నత సమావేశం నిర్వహించారు సీఎం కేసీఆర్. రాబోయే వానకాలం పంటల సాగుపై ముందస్తు ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలన్నారు. ప్రధానంగా పత్తి, వరి, కంది, సాగుపై దృష్టి పెట్టాలని కోరారు. రైతులను ప్రత్యామ్నాయ లాభసాటి పంటల సాగు దిశగా సమాయత్తం చేయాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.

Tags

Read MoreRead Less
Next Story