Telangana: తెలంగాణలో అకాల వర్షాలు.. మరో మూడు రోజుల పాటు..

Telangana: తెలంగాణలో అకాల వర్షాలు.. మరో మూడు రోజుల పాటు..
Telangana: తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. హైదరాబాద్‌లోని పలు చోట్ల భారీ వర్షం కురిసింది.

Telangana: తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. హైదరాబాద్‌లోని పలు చోట్ల భారీ వర్షం కురిసింది. అల్వాల్‌, తిరుమలగిరి, కర్ఖానా, బొల్లారం, జవహార్ నగర్ ప్రాంతాలో కురిసిన వర్షానికి రోడ్లపై భారీగా వరద నీరు నిలిచిపోయింది. వర్షం కారణంగా ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లేవాళ్లు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. రోడ్లపై నీరు నిలిచిపోవడంతో చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ జామైంది.

అటు.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం పడింది. కరీంనగర్‌లో గీతాభవన్ చౌరస్తాలో ఉన్న ఓ పెద్ద హోర్డింగ్ .. జోరు గాలివానకు కుప్పకూలిపోయింది. రాముడి పట్టాభిషేకం ఆవిష్కరించేలా ఏర్పాటు చేసిన 70 అడుగుల ఎత్తైన భారీ కటౌట్ గాలివానకు పడిపోయింది.

మరోవైపు.. ఈదురు గాలుల ధాటికి విద్యుత్ దీపాల అలంకరణ లుమినార్ కూలిపోయింది. ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఫిబ్రవరిలో జరగబోయే బ్రహ్మోత్సవాల్లో రాముడి పట్టాభిషేకాన్ని ఆవిష్కరించేలా సుమారు రూ. 45 లక్షలు వెచ్చించి ఈ భారీ హోర్డింగ్ ఏర్పాటు చేశారు.

ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల వ్యాప్తంగా అకాల వర్షం కురసింది. బోథ్ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ఉరుములు మెరువులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. అకాల వర్షాలతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. రాగల మూడు రోజుల్లో రాష్ట్రంలో తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపారు వాతావరాణశాఖ అధికారులు.

Tags

Read MoreRead Less
Next Story