KRMB: ప్రాజెక్టుల అప్పగింత అవాస్తవం

KRMB: ప్రాజెక్టుల అప్పగింత అవాస్తవం
శ్రీశైలం, సాగర్‌ ఔట్‌లెట్ల ద్వారా నీటి విడుదలే కేఆర్‌ఎంబీ బాధ్యతన్న తెలంగాణ ఈఎన్‌సీ... స్పష్టం చేసిన రాహుల్‌బొజ్జా

తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టులను KRMBకి ధారాదత్తం చేసి.. రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టిందన్న తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు నీటిపారుదలశాఖ స్పష్టం చేసింది. కేంద్ర జలశక్తి శాఖ సమావేశం మినిట్స్ తప్పుగా వచ్చాయని సవరణ కోరుతూ లేఖ రాసినట్లు తెలంగాణ నీటిపారుదలశాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా తెలిపారు. ప్రాజెక్టులు ఇస్తామని తాము ఎక్కడా చెప్పలేదని అభ్యంతరాలు నివృత్తి చేస్తేనే ప్రాజెక్టులు అప్పగిస్తామని చెప్పామని స్పష్టం చేశారు. విద్యుత్ కేంద్రాలు మినహాయించి ప్రాజెక్టుల ద్వారా నీటి విడుదల, నీటి నిర్వాహణ మాత్రమే కృష్ణా నదీ యాజమాన్య బోర్డు బాధ్యత అని తెలిపారు. కృష్ణా బోర్డు ఛైర్మన్ తో జరిగిన భేటీలో.... ENC అన్ని అంశాలను స్పష్టంగా చెప్పారని... షరతులు అంగీకరించకుండా ప్రాజెక్టులు స్వాధీనం చేయబోమని కూడా తేల్చి చెప్పారని...... రాహుల్ బొజ్జా తెలిపారు. ప్రాజెక్టులను స్వాధీనం చేస్తామని నీటిపారుదల శాఖ బడ్జెట్ పుస్తకాల్లో గత ప్రభుత్వం చెప్పిందని.. ఇప్పుడు కొత్తగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని... వివరించారు. త్రిసభ్య కమిటీ నిర్ణయాల ప్రకారమే నీటి నిర్వహణ జరుగుతుందని నీటిపారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్ చెప్పారు. గతంలో.. ఇదే విధానం ఉందని, కొత్తగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టంచేశారు.


కృష్ణా బోర్డు ఛైర్మెన్ తో సమావేశంలో ఈఎన్సీ అన్ని అంశాలను స్పష్టంగా చెప్పారని, షరతులు అంగీకరించకుండా స్వాధీనం చేయబోమని చెప్పినట్లు రాహుల్ బొజ్జా పేర్కొన్నారు. స్వాధీనం చేస్తామని నీటిపారుదల శాఖ బడ్జెట్ పుస్తకాల్లో రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే చెప్పిందని, ఇప్పుడు కొత్తగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వివరించారు. విభజన చట్టం ప్రకారం జలవిద్యుత్ కేంద్రాల నిర్వహణ ఆయా రాష్ట్రాలే నిర్వహిస్తాయని... శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల పరిధిలో మిగిలిన ఔట్ లెట్స్ అప్పగింతకు ప్రభుత్వం అనుమతి పొందాల్సిన అవసరం ఉందని ఈఎన్సీ సమావేశంలో స్పష్టం చేసినట్లు తెలిపారు. డ్యాంల నిర్వహణ మాత్రం ఆయా రాష్ట్రాల పరిధిలోనే ఉంటుందన్న నిర్ణయం జరిగిందని అన్నారు. షరతులు అంగీకరించకుండా ప్రాజెక్టులు అప్పగించబోమని, అపెక్స్ కౌన్సిల్ కు నివేదించాలని గతంలో స్పష్టంగా చెప్పామన్న నీటిపారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్ సీఆర్పీఎఫ్ బలగాలను ఉపసంహరించుకోవాలని కోరినట్లు చెప్పారు.

త్రిసభ్య కమిటీ నిర్ణయాల ప్రకారమే నీటి నిర్వహణ జరుగుతుందని... గతంలో కూడా ఇదే విధానం ఉందని, కొత్తగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వివరించారు. అప్పగించారని అనడం దురదృష్టకరమని పేర్కొన్నారు. పది ఔట్ లెట్లను కృష్ణా బోర్డు నిర్వహిస్తుందని, రెండు రాష్ట్రాల ఇంజనీర్లు ఉంటారని ఈఎన్సీ తెలిపారు. అప్పగింత, స్వాధీనం అంటూ ఏదీ లేదన్న ఆయన ఇకనుంచి ఔట్ లెట్ల నిర్వహణ, నీటి నియంత్రణ బోర్డు ద్వారా జరుగుతుందని చెప్పారు. జల విద్యుత్ కేంద్రాల విషయమై రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవాల్సి ఉందని... జవాబుదారీ తనం ఉండాలని బోర్డు ద్వారా ఔట్ లెట్ల నిర్వహణకు నిర్ణయించినట్లు వివరించారు.

Tags

Read MoreRead Less
Next Story