TS: వాహనదారులూ.. తస్మాత్‌ జాగ్రత్త

TS: వాహనదారులూ.. తస్మాత్‌ జాగ్రత్త
పన్ను చెల్లించకుండా వాహనం తప్పితే చిక్కుల్లో పడ్డట్లే... హెచ్చరిస్తున్న రవాణశాఖ అధికారులు

తెలంగాణ (Telangana) వ్యాప్తంగా త్రైమాసిక పన్ను చెల్లించని వాహనదారుల వివరాలను రవాణాశాఖ అధికారులు సేకరించారు. ఇప్పటివరకూ సుమారు 37 కోట్ల రూపాయల వరకు వాహనదారులు చెల్లించాల్సి ఉందని గుర్తించారు. దీంతో పన్ను చెల్లించకుండా రోడ్లపై తిప్పుతున్న వాహనదారులపై ప్రత్యేక దృష్టిసారించారు. వాహనదారులు పన్ను చెల్లించే గడువు జనవరి 31తో ముగియగా.... మొదటి నెలలో వాహనదారులు పన్ను చెల్లిస్తే 25శాతం, రెండవ నెలలో చెల్లిస్తే 50శాతం అదనపు పన్నుతో ఫీజు వసూలు చేయాలని రవాణా శాఖ నిర్ణయించింది. అలా కాకుండా పన్ను చెల్లించకుండా వాహన తనిఖీల్లో దొరికితే మొదటి నెలలో వందశాతం జరిమానా, రెండవ నెలలో దొరికితే 200 శాతం జరిమానా విధిస్తామని రవాణా శాఖ అధికారులు హెచ్చరించారు. అందుకే వాహనదారులు పన్నులను తక్షణమే చెల్లించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. తనిఖీల్లో దొరికితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే ప్రసక్తే ఉండదని హెచ్చరిస్తున్నారు..


పన్నులు చెల్లించకుండా తిరుగుతున్న వాహనాలపై తనిఖీలు చేపట్టినట్లు రవాణా శాఖ స్పష్టం చేసింది. ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ (Hyderabad) పరిధిలో 220 వాహనదారుల నుంచి 10లక్షల 38వేల 300 రూపాయల పన్నులను, 4లక్షల69వేల320 రూపాయల కాంపౌండింగ్ ఫీజును వసూలు చేసినట్లు హైదరాబాద్ సంయుక్త రవాణాశాఖ అధికారి రమేష్ తెలిపారు. సెంట్రల్ జోన్ పరిధిలో 76 కేసులు నమోదు కాగా.... 4లక్షల రూపాయలకు పైగా పన్ను, లక్షా 84వేల 20 రూపాయల కాంపౌండింగ్ ఫీజు వసూలు చేశారు. నార్త్ జోన్ పరిధిలో 52 కేసులు నమోదు కాగా... లక్షా 71వేల 600రూపాయల పన్ను, లక్షా 14వేల 620 రూపాయల కాంపౌండింగ్ ఫీజు వసూలు చేశారు. ఈస్ట్ జోన్ పరిధిలో 40 కేసులు నమోదు కాగా... లక్షా 54వేల180 రూపాయల పన్ను, 79వేల770 కాంపౌండింగ్ ఫీజు వసూలు చేశారు. సౌత్ జోన్ పరిధిలో 36 కేసులు నమోదు కాగా.... లక్షా 45వేల 880 రూపాయలను పన్నుగా..., 51వేల 430 కాంపౌండింగ్ ఫీజుగా వసూలు చేశారు. వెస్ట్ జోన్ పరిధిలో 16 కేసులు నమోదు కాగా....లక్షా 65వేల 525 రూపాయలు పన్నుగా...., 39వేల 480 రూపాయలు కాంపౌండింగ్ ఫీజుగా వసూలు చేసినట్లు అధికారులు వివరించారు. తమ వద్ద డబ్బులు లేకపోవడంతోనే త్రైమాసిక పన్ను చెల్లించలేకపోతున్నామని వాహనదారులు చెబుతున్నారు. ఫీజులో రాయితీ కల్పిస్తే తమకు ఆర్థికంగా కొంత వెసులుబాటు కలుగుతుందని రవాణా శాఖకు విజ్ఞప్తి చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story