Top

హాలీయ సభలో ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డ సీఎం కేసీఆర్!

హాలీయ సభలో ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు సీఎం కేసీఆర్. కొందరు కాంగ్రెస్‌ నేతలు అవాకులు చవాకులు మాట్లాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

హాలీయ సభలో ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డ సీఎం కేసీఆర్!
X

నల్లగొండ జిల్లాపై సీఎం కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. హాలియా బహిరంగ సభలో మాట్లాడిన ఆయన ప్రతి పంచాయతీకి 20 లక్షలు, ప్రతి మున్సిపాలిటీకి కోటి రూపాయలు, నల్లగొండ మున్సిపాలిటీకి 10 కోట్లు, మిర్యాలగూడ మున్సిపాలిటీకి 5 కోట్లు ప్రకటించారు. మొత్తంగా నల్లగొండ అభివృద్ధికి 186 కోట్ల రూపాయలు ప్రకటించారు సీఎం కేసీఆర్‌. నల్లగొండ ఆయకట్టుకు శాశ్వతంగా నీళ్లు అందిస్తామన్నారు. టీఆర్ఎస్ అంటే వీరుల పార్టీ అని.. వీపు చూపించే పార్టీ కాదన్నారు. లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేయకపోతే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగమన్నారు. అందరూ కష్టపడి పని చేయాలని నేతలకు పిలుపునిచ్చారు.

హాలీయ సభలో ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు సీఎం కేసీఆర్. కొందరు కాంగ్రెస్‌ నేతలు అవాకులు చవాకులు మాట్లాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక బీజేపీ నేతలు కొత్త బిచ్చగాడు పొద్దెరగడన్నట్లు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. తాము తలుచుకుంటే కాంగ్రెస్ మిగలదన్నారు. బీజేపీ, కాంగ్రెస్‌ నేతలు ఒళ్లు దగ్గర పెట్టుకోవాలన్నారు. హద్దు మీరినప్పుడు ఏం చేయాలో తమకు తెలుసని.. తొక్కిపడేస్తాం జాగ్రత్త అంటూ హెచ్చరించారు. తమకు ప్రజలు తీర్పు ఇచ్చారని.. ఢిల్లీ వాళ్లు చెబితే రాలేదన్నారు. కాంగ్రెస్‌కు తెలంగాణ పేరు పలికే అర్హత లేదన్నారు. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలకు కారణం ఎవరన్నారని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని 3 ముక్కలు చేసిన పాపాత్ములు కాంగ్రెస్‌ నేతలు కాదా అన్నారు.

తెలంగాణ అభివృద్ధికి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందన్నారు సీఎం కేసీఆర్‌. దేశంలో ఎక్కడా కూడా రైతులకు రైతుబంధు, ఉచిత కరెంట్, బీమా ఇవ్వడం లేదని, ఒక్క తెలంగాణ ప్రభుత్వమే ఇస్తోందన్నారు సీఎం కేసీఆర్‌. గతంలో విజయడైరీని ముంచితే కాంగ్రెస్‌ నేతలు నోరు తెరవలేదన్నారు. ఇప్పుడు మళ్లీ విజయడైరీకి పూర్వవైభవం తెచ్చామన్నారు. ఎఫ్‌సీఐకి అత్యధిక వడ్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణా అన్నారు. కళ్యాణలక్ష్మి, కంటివెలుగు పథకాలు కనిపిస్తలేవా? అని ప్రశ్నించారు. దేశంలో ఎవరైనా ఇలాంటి పథకాలు అమలు చేశారా అని అడిగారు. ఆడబిడ్డ పుడితే 13 వేలు, మగ పిల్లాడు పుడితే 12 వేలు ఇస్తున్నామన్నారు సీఎం కేసీఆర్‌.

Next Story

RELATED STORIES