Telangana: కోట్లల్లో ఖల్లాస్‌

Telangana: కోట్లల్లో ఖల్లాస్‌
శ్రీధర్ రెడ్డి, సంధ్యారెడ్డి అనే దంపతులు ఇంజనీరింగ్, మెడికల్ సీట్లు ఇప్పిస్తామంటూ అమాయకుల వద్ద కోట్ల రూపాయలు వసూలు

విద్యార్థులకు మెడికాల్‌, ఇంజనీరింగ్‌ సీట్లు ఇప్పిస్తామని ఆశచూపి కోట్లలో దండుకున్నారు ఓ కిలాడి జంట. అందుకు సీఎం క్యాంప్‌ ఆఫీస్‌ పేరును వాడుకున్నారు. శ్రీధర్ రెడ్డి, సంధ్యారెడ్డి అనే దంపతులు ఇంజనీరింగ్, మెడికల్ సీట్లు ఇప్పిస్తామంటూ మాయమాటలు చెప్పి అమాయకుల వద్ద కోట్ల రూపాయలు వసూలు చేశారు. మెడికల్ సీట్ కు 50 లక్షల నుండి కోటి వరకు ఇంజనీరింగ్ సీటుకు 10 లక్షల నుండి 16 లక్షల వరకు వసూలు చేశారు.

'గ్రోవెల్ ఎడ్యుకేషనల్ కెరియర్ సర్వీసెస్' పేరుతో కాచిగూడలో సంస్థలు ఏర్పాటు చేసి ఈ ఘరనా మోసాలకు పాల్పడుతున్నారు. వీరు గత రెండున్నరేళ్లుగా మోసాలు చేస్తూ భారీగా డబ్బు దండుకున్నట్లు తెలుస్తోంది. సీట్లు ఇప్పించకపోవడంతో ఆందోళనకు దిగారు బాధితులు. గ్రోవెల్‌ ఎడ్యుకేషనల్‌ సర్వీసెస్‌పై ఏడాది క్రితమే కేసు నమోదయింది. అంబర్‌పేట్‌, సుల్తాన్‌బజార్‌, సీసీఎస్‌లో పీఎస్‌లో కేసులు నమోదయ్యాయి. నిందితులు పరారీలో ఉన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు సీసీఎస్‌ పోలీసులు.

Tags

Read MoreRead Less
Next Story