Telangana: తెలంగాణ ఎన్నికల బడ్జెట్‌

Telangana: తెలంగాణ ఎన్నికల బడ్జెట్‌
దాదాపు రూ.3లక్షల కోట్లతో తెలంగాణ బడ్జెట్‌; అన్ని రంగాలకు భారీ కేటాయింపులు; గత ఎనిమిది బడ్జెట్ల కంటే మెరుగైన పద్దులు

అసెంబ్లీలో ప్రవేశ‌పెట్టేందుకు కేసీఆర్‌ ఎన్నిక‌ల బ‌డ్జెట్ సిద్దమ‌యింది. జ‌నాక‌ర్షక ప‌థకాల‌తో బ‌డ్డెట్ ప‌ద్దులు సర్కార్‌ సిద్దం చేసింది. కేసీఆర్‌ ప్రభుత్వానికి ఈ దఫాలో ఇదే చివ‌రి బ‌డ్జెట్ కావ‌డంతో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రతిప‌క్ష పార్టీలు అస్త్రశ‌స్త్రాల‌తో రెడీ అవుతున్నాయి... ఇంతకీ కేసీఆర్ ఎన్నిక‌ల బ‌డ్జెట్ ఎలా ఉండ‌బోతుంది, ప్రతిప‌క్షాల వ్యూహం ఏంటి..? ఇప్పుడు చూద్దాం. 2023చివ‌ర‌లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోతున్నాయి.అందుకు త‌గ్గట్టుగా ఎన్నిక‌ల బడ్జెట్‌ను రెడీ అవుతుంది సర్కార్.కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు ఒరిగిందేమి లేద‌ంటోంది బీఆర్‌ఎస్‌ పార్టీ. అయితే ఈసారి బడ్జెట్‌ అన్ని రంగాలకు మేలు చేసేలా ఉంటుందని ప్రభుత్వ పెద్దలు అంటున్నారు. గత ఎనిమిది బ‌డ్జెట్ ల కంటే మెరుగైన ప‌ద్దులు ఈ సారి బ‌డ్జెట్ లో ఉండ‌నున్నట్లు సమాచారం. దాదాపు మూడులక్షల కోట్ల బ‌డ్టెట్ ప్రవేశ పెట్టేందుకు ఆర్దిక మంత్రి హరీశ్‌ రావు సిద్ధమైయ్యారు.


ఓ వైపు కరోనా ఎఫెక్ట్‌, మరోవైపు కేంద్రం నుంచి రావల్సిన నిధుల్లో కోతలతో తెలంగాణ సర్కార్‌ ఇబ్బందులు పడుతోంది. ఒకటో తారీఖు వచ్చినా జీతాలు ఇవ్వలేని పరిస్థితి, అలాగే పెన్షన్లు,ఇత‌ర సంక్షేమ ప‌ధ‌కాల అమ‌లులో జాప్యం ఏర్పడ‌డంతో స‌ర్కారుపై విమ‌ర్శలు పెరిగాయి.ఎన్నికల వేళ విపక్షాలకు ఇదే ప్రధాన అస్త్రంగా మారుతుండటంతో బడ్జెట్‌లో భారీగా నిధులు కేటాయించి స‌మ‌స్యల నుంచి గట్టెక్కే ప్రయత్నం చేసే దిశగా అడుగులు వేస్తోంది బీఆర్‌ఎస్‌ సర్కార్‌.

కేంద్ర సర్కార్‌ ప్రేశపెట్టిన బడ్జెట్‌పై బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు, ఇది రైతు వ్యతిరేక బడ్జెట్‌ అని ఆరోపణలు చేశారు. అయితే తెలంగాణ బడ్జెట్‌లో కొత్త స్కీంలను ప్రవేశపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఎలక్షన్‌ ఇయర్‌ కావ‌డంతో ఇచ్చిన హామీల అమలు చేసేందుకు చర్యలు అలాగే కొత్త పధకాలకు శ్రీకారానికి ప్రధాన్యత ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ద‌ళితబంధు, డ‌బుల్ బెడ్రూమ్ ఇళ్లు, సొంత స్థలంలో ఇళ్లు నిర్మించుకునే వారికి మూడు లక్షల ఆర్ధిక సాయం వంటి వాటికి భారీగా కేటాయింపులు ఉండే అవకాశం ఉంది. గిరిజ‌న బంధుకు భారీగా నిధులు కేటాయించే అవ‌కాశం ఉంది.


తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పధకాలతో పాటు మున్సిపాలిటీలు గ్రామ పంచాయితీల అభివృద్దికి నిధులు కేటాయించేలా ప‌ద్దులు రూపొందించారిని సమాచారం.సంక్షేమానికి బ‌డ్జెట్ పెర‌గ‌నుండ‌డంతో సాగునీటి ప్రాజెక్టుల‌కు బ‌డ్జెట్ త‌గ్గే అవ‌కాశం ఉందని అంటున్నారు . విద్యా,వైద్యానికి నిధుల కోర‌త లేకుండా బ‌డ్జెట్ లో జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తుంది.

Tags

Read MoreRead Less
Next Story