Telangana: మున్సిపాలిటీల్లో పంచాయితీ..అధికార పార్టీకి తలనొప్పి

Telangana: మున్సిపాలిటీల్లో పంచాయితీ..అధికార పార్టీకి తలనొప్పి
తెలంగాణ మున్సిపాలిటీల్లో పంచాయితీలు రోజురోజుకు ముదురుతున్నాయి, సీఎం సొంత నియోజకవర్గం గజ్వేల్‌ మున్సిపాలిటీలోనూ అదే తీరు

తెలంగాణ మున్సిపాలిటీల్లో పంచాయితీలు రోజురోజుకు ముదురుతున్నాయి. అధికార పార్టీకి అవిశ్వాస సెగలు తగులుతున్నాయి. ఇప్పటికే 15 మున్సిపాలిటీల్లో అవిశ్వాసం పెట్టారు అధికార పార్టీ కౌన్సిలర్లు. సీఎం సొంత నియోజకవర్గం గజ్వేల్‌ మున్సిపాలిటీలోనూ అదే తీరు నెలకొంది. ఛైర్మన్‌లు ఏకపక్షంగా వ్యవహరించడం నిధుల దుర్వినియోగమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.

ఎన్నికల ఏడాది కావడంతో అధికార పార్టీకి తలనొప్పులు వచ్చి పడ్డాయి. దీంతో ఇలాంటి విపత్తును ముందే పసిగట్టింది సర్కార్‌. మున్సిపల్‌ యాక్ట్‌ను మారుస్తూ తీర్మానం చేసింది. అమెండ్‌మెంట్‌ బిల్లు గవర్నర్‌ వద్ద పెండింగ్‌లో ఉంది. బిల్లుకు గవర్నర్‌ ముద్ర పడితే అధికార పార్టీకి ఊరట లభించినట్లే. లేదంటే అవిశ్వాసం ఎఫెక్ట్‌తో బీఆర్‌ఎస్‌కు ఇబ్బందులు తప్పవంటున్నారు ఎక్స్‌పర్ట్స్‌.

Tags

Read MoreRead Less
Next Story