Telangana: వేములవాడలో ఏర్పాట్లు తూతూ మంత్రం

Telangana: వేములవాడలో ఏర్పాట్లు తూతూ మంత్రం
మంత్రి కేటీఆర్ నాలుగు సార్లు రివ్యూ చేసినా ఫలితం లేదు

దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో మహాశివరాత్రి జాతర ఘనంగా జరుగుతుంది. రేపటి నుంచి వేములవాడలో శివరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ జాతరకు రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారు. ఐతే ఇంతటి ముఖ్యమైన జాతరకు ఏర్పాట్లు మాత్రం అరకొరగానే ఉన్నాయి. మంత్రి కేటీఆర్ నాలుగు సార్లు రివ్యూ చేసినా ఫలితం లేకుండా పోయింది. రాజన్న ఆలయంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా పరిస్థితి మారింది.

రాజన్న దర్శనం కోసం దాదాపు 3 నుంచి 4 లక్షల మంది వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. 3 కోట్ల రూపాయల అంచనాలతో ఏర్పాట్లు మొదలుపెట్టారు. రేపటి నుంచి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఐనప్పటికీ ఏర్పాట్లు పూర్తి కాలేదు. జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి తరచూ విజిట్ చేసిన ఏర్పాట్లలో వేగం పెరగలేదు. అధికారుల హడావిడి తప్పితే చేసిందేమి లేదంటున్నారు భక్తులు.

గుడి చెరువు మైదానంలో తూతూ మంత్రంగా చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. క్యూలైన్లలో పందులు తిరుగుతున్నాయి. ఎక్కడా చూసిన బురదతో ఆలయ పరిసరాలు అపరిశుభ్రంగా మారాయి. కోట్ల రూపాయలతో ఏర్పాట్లు చేస్తామన్న అధికారులు మాటలకే పరిమితమయ్యారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story