Telangana : పొంగులేటి, జూపల్లిపై బీజేపీ కన్ను

Telangana : పొంగులేటి, జూపల్లిపై బీజేపీ కన్ను

బీఆర్ఎస్ అధిష్టానంపై విమర్శలు గుప్పించి సస్పెండ్ కు గురైన ఖ‌మ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు.. ఏ పార్టీలో చేరబోతున్నారు.. చేరితే ఈ ఇద్దరి నేతల రాజకీయ భవితవ్యం ఎలా ఉండబోతోంది..? జాతీయ పార్టీలో చేరుతారా..? ఇద్దరు నేతలకు మరేదైనా వ్యూహం ఉందా..? అనే విషయాలు ఇప్పుడు పొలిటికల్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.

బీఆర్ఎస్ సస్పెండ్ చేసిన నేతలకు బీజేపీ ఆఫర్లు ఇస్తోంది.జూపల్లి, పొంగులేటితో బీజేపీ నేతల చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.జూపల్లి కృష్ణారావుకు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఫోన్ చేసి బీజేపీలో చేరాలని జూపల్లికి డీకే అరుణ ఆహ్వానం అందించినట్లు సమాచారం . మరోవైపు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి నివాసానికి వెళ్లిన బూర నర్సయ్యగౌడ్ కలిసి పనిచేద్దామని, బీజేపీలో చేరాలని కోరారు. అటుపొంగులేటి, జూపల్లితో టచ్‌లో ఉన్నారు ఈటల రాజేందర్‌.


డీకే అరుణ, జూపల్లి కృష్ణారావు ఇద్దరిదీ ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లానే. గతంలో ఇద్దరూ కాంగ్రెస్‌ పార్టీలో కలిసి పనిచేశారు. ఆ సమయంలో కాంగ్రెస్‌లో ఉన్నప్పటికీ..ఇద్దరి మధ్య కోల్డ్‌వార్‌ నడిచేవన్న విమర్శులు ఉండేవి. పార్టీలోనూ ఆధిపత్యం కోసం అనేక ఎత్తుగడలు హీట్‌ పుట్టించేవి. మారిన రాజకీయ పరిణామాలతో జూపల్లికి డీకే అరుణ ఫోన్‌ చేయడం హాట్‌ టాపిక్‌గా మారింది.

Tags

Read MoreRead Less
Next Story